PM ModI: అస్సాం హైవే మీద మోడీ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్-రీజన్ ఇదే..!
అది చైనా సరిహద్దుల్లోని భారత్ లోని ఈశాన్య రాష్ట్రం అస్సాం. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కి అత్యంత సమీపంలో ఉంటుంది. అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో ఈశాన్య రాష్ట్రాల్ని కలిపే జాతీయ రహదారి ఉంది. దీనిపై ఇవాళ ప్రధాని మోడీ (PM Modi) ప్రయాణించిన సీ-130జే యుద్ధ విమానం హఠాత్తుగా ల్యాండ్ అయింది. దీంతో ఒక్కసారిగా జనం కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. ఇంతకీ ఇక్కడ హైవేపై ప్రధాని మోడీ విమానం ఎందుకు దిగిందో ఓసారి చూద్దాం..
ప్రధాని మోడీ ఇవాళ అస్సాంలోని మోరాన్ లో ఉన్న హైవే మీద సీ-13జే యుద్ధ విమానంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యారు. ఇక్కడ యుద్ధ అవసరాల కోసం జాతీయ రహదారిని కాస్తా రన్ వేగా మార్చారు. అత్యవసర పరిస్ధితుల్లో యుద్ధ విమానాలు ఇక్కడ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశారు. దీన్ని పరీక్షించేందుకు ఇవాళ ప్రధాని మోడీ అక్కడికి వెళ్లారు. ఈశాన్య భారత దేశంలో నిర్మించిన తొలి అత్యవసర విమాన ల్యాండింగ్ ఫెసిలిటీ ఇది.

VIDEO | Assam: Prime Minister Narendra Modi (@narendramodi) arrives at Emergency Landing Facility (ELF) on the Moran Bypass in Dibrugarh.
— Press Trust of India (@PTI_News) February 14, 2026
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/RE9PMXlWam
సవాలుతో కూడిన పరిస్థితుల్లో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను సకాలంలో మోహరించడానికి వీలుగా అత్యవసర ప్రతిస్పందనకు ఈ సౌకర్యం చాలా ముఖ్యమైనదని ప్రధాని మోదీ ఎక్స్ లో తెలిపారు. దేశవ్యాప్తంగా యుద్ద పరిస్ధితుల్లో సాధారణ విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్ ల మీద శత్రువులు దాడి చేస్తే.. ప్రత్యామ్నాయంగా మన యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలను ఆర్మీ నిర్మిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైవేలనే ఇలా ఎయిర్ స్ట్రిప్ లుగా మారుస్తోంది. సాధారణ పరిస్ధితుల్లో ఇవి హైవేలుగా ఉపయోగపడతాయి. అత్యవసర పరిస్ధితుల్లో మాత్రం యుద్ద విమానాలకు పనికొస్తాయి.












Click it and Unblock the Notifications