ప్రధాని మోడీ మన్ కీ బాత్ 105వ ఎపిసోడ్.. హైలైట్స్ ఇవే!!
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ (man ki baat) 105వ ఎపిసోడ్లో భారతదేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో జీ 20 శిఖరాగ్ర సమావేశం గురించి, చంద్రయాన్ 3 విజయం సాధించటం పైన, మిడిల్ ఈస్ట్ మరియు యూరోప్ మధ్య షిప్పింగ్ కారిడార్ ఒప్పందం పైన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు.
అంతేకాదు పార్లమెంట్లో అత్యంత ముఖ్యమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ( women reservation bill) ఆమోదం పొందటం పైన కూడా ఆయన తన ఆలోచనలను దేశ ప్రజలతో పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా జి20 శిఖరాగ్ర సమావేశం గురించి మాట్లాడారు.

జీ 20 శిఖరాగ్ర సమావేశాలలో (G20 summit) గాంధీజీకి నివాళులర్పించేందుకు ప్రపంచం నలుమూలలనుండి నాయకులు రాజ్ ఘాట్ కు వెళ్ళినప్పుడు ఆ దృశ్యాన్ని దేశం మరిచిపోలేదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ నాయకులందరూ కలిసి రాజ్ ఘాట్ కి చేరుకోవడం బాపు ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా నేటికీ ఉన్నాయని చెప్పడానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
గాంధీ జయంతి (gandhi jayanti) రోజున దేశవ్యాప్తంగా పరిశుభ్రతకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్న ప్రధాని మోడీ అక్టోబర్ 1 ఉదయం 10గంటలకు పరిశుభ్రతపై పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు తెలిపారు . ఈ కార్యక్రమంలో దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కూడా మాట్లాడిన పీఎం మోడీ వరల్డ్ టూరిజం డే (world tourism day) టూరిజాన్ని కొంతమంది సందర్శన వస్తువుగా మాత్రమే చూస్తున్నారని కానీ ఇది ఉపాధికి సంబంధించినది కూడా అంటూ పేర్కొన్నారు. పర్యాటక రంగం గరిష్ట ఉపాధిని సృష్టిస్తుందని పేర్కొన్న ప్రధాని మోడీ గత కొన్నేళ్లుగా భారత్ పట్ల ఆకర్షణ పెరిగిందని ఎక్కడికి వెళ్ళినా భారతదేశ వైవిధ్యాన్ని చూసే అర్థం చేసుకోవాలని సూచించారు.
ఇటీవల ఐదు రోజుల పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం పైన మాట్లాడిన ప్రధాని మోడీ, బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం ఇంకా పెండింగ్లో ఉందని మహిళల కోసం కూలంగా ప్రభుత్వం చేసిన పనికి మహిళా ఎంపీ లతో పాటుగా సభ్యులందరినీ ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఇంకా చంద్రయాన్ 3 (chandrayan 3) విజయం పైన ప్రధాని నరేంద్ర మోడీ భారత ప్రజలతో సంతోషాన్ని పంచుకున్నారు. అంతరిక్ష రంగంలో సాధిస్తున్న ప్రగతిని గురించి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications