కెనడాకు ప్రధాని మోడీ బిగ్ షాక్..! జీ7 సదస్సుకు డుమ్మా ?
ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా ఉన్న వారికి మద్దతిస్తున్న కెనడా .. భారత్ తో దౌత్యసంబంధాలను తెంచుకుంటూ పోతోంది. గతంలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా పతనం అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలూ దౌత్యవేత్తల బహిష్కరణలు కూడా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలో ప్రభుత్వం మారినా భారత్ వైఖరి మాత్రం మారేలా కనిపించడం లేదు.
ఈ నెల 15 నుంచి 17 వరకూ కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. దీనికి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, జపాన్, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు హాజరవుతున్నాయి. ఈ మేరకు కెనడా పంపిన ఆహ్వనాల్ని ఆయా దేశాలు అంగీకరించాయి. అయితే భారత్ కు మాత్రం కెనడా నుంచి జీ 7 సదస్సుకు రావాలని ఆహ్వానం అందలేదు. భారత్ కు కెనడా ఆతిధ్య దేశం హోదాలో ఆహ్వానం పంపాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ ఆహ్వానం రాలేదు. దీంతో భారత్ కూడా ఈ సదస్సు విషయంలో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ కెనడాలో జరిగే జీ7 సదస్సుకు ఆహ్వనం అందినా వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. కెనడాతో దిగజారిన సంబంధాల నేపథ్యంలో భారత్ ఈ సదస్సుకు హాజరు కాకుండా దూరంగా ఉంటేనే మంచిదని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. కెనడాలో సిక్కు తీవ్రవాద సమస్య కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోడీ అక్కడికి వెళ్తే భద్రతా పరమైన సమస్యలు కూడా ఉంటాయని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే విదేశాంగశాఖ రెండుసార్లు ప్రధాని మోడీ కెనడా పర్యటనపై సమాచారం లేదని తెలిపింది.
అయితే కెనడాలో కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ మాత్రం భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు అక్కడి విదేశాంగమంత్రి అంకితా ఆనంద్ తెలిపారు. కెనడా గడ్డపై హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య జరగడం వల్లే ఇరుదేశాల మధ్య గ్యాప్ వచ్చిందని ఆమె తెలిపారు. ఈ ఘటనలో భారత్ పాత్ర ఉందని కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య దౌత్య బంధాల్ని చెడగొట్టాయి.












Click it and Unblock the Notifications