వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్.. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, దోవల్‌తో ప్రధాని మోడీ భేటీ.. డ్రోన్ల సంచారంతో

|
Google Oneindia TeluguNews

జమ్ముకశ్మీర్‌లో డ్రోన్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. వరసగా డ్రోన్లను ప్రయోగిస్తున్నాయి. దీనిని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఏం జరుగుతుందనే అంశంపై హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు.

Recommended Video

డ్రోన్ ను పేల్చి.. పాక్ వెన్నులో వణుకు పుట్టించిన భారత్..!!
నిన్న కూడా డ్రోన్లు..

నిన్న కూడా డ్రోన్లు..

జమ్ము మిలిటరీ స్టేషన్ వద్ద నిన్న కూడా డ్రోన్లు కలకలం రేపాయి. దీంతో దాడి చేసే అవకాశం ఉందని ఆర్మీ హెచ్చరించింది. తమ సిబ్బంది కాల్పులు జరపడంతో.. డ్రోన్లను వెనక్కి వెళ్లిపోయానని చెప్పారు. ఆదివారం జమ్ము ఎయిర్ బేస్‌పై జరిగిన దాడికి లష్కరే తోయిబా హస్తం ఉండొచ్చని కశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఆ గ్రూపే డ్రోన్లను ప్రయోగించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

6 కి.మీ దూరంలో..

6 కి.మీ దూరంలో..

జమ్మూ కశ్మీర్‌లో డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటల టైంలో కుంజ్వాని, రత్నుచుక్
ఏరియాలో డ్రోన్లు కనిపించాయి. అయితే కొద్ది సేపటి తర్వాత మళ్లీ అవి కనిపించలేదు. కుంజ్వాని ప్రాంతం సత్వారి ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతో ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు.

ఆదివారం.. సోమవారం కూడా

ఆదివారం.. సోమవారం కూడా

కలుచాక్ మిలిటరీ స్టేషన్ దగ్గర్లో ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఒకటి, సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు మరొ డ్రోన్ ఎగురుతూ కనిపించాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే డ్రోన్లను కూల్చేందుకు కాల్పులు జరిపారు. తర్వాత వెంటనే రెండు డ్రోన్లు పాక్ వైపు వెళ్లిపోయాయి. ఆదివారం తెల్లవారుజామున జమ్మూ ఎయిర్ పోర్టులోని ఐఏఎఫ్ స్టేషన్‌పై డ్రోన్ల సాయంతో రెండు బాంబులను వేశారు. ఈ దాడిలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. పాకిస్థాన్ బోర్డర్‌కు కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐఏఎఫ్ స్టేషన్‌పై పేలుళ్లు జరగడం కలకలం రేపింది. మూడు రోజుల్లో మొత్తం 5 డ్రోన్లు భారత భూభాగంలో కలకలం సృష్టించాయి.

ఎన్ఐఏకు కేసు

ఎన్ఐఏకు కేసు

ఆదివారం జమ్మూలోని ఐఏఎఫ్ స్టేషన్‌పై జరిగిన దాడి కేసు విచారణను కేంద్ర హోం శాఖ ఎన్ఐఏకు అప్పగించింది. పేలుడులో ఆర్డీఎక్స్
లేదా టీఎన్‌టీ ఉపయోగించినట్లు స్పెషల్ బాంబ్ స్క్వాడ్ టీం అనుమానిస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఈ దాడికి పాల్పడినట్లు
అధికారులు భావిస్తున్నారు. డ్రోన్లను స్థానికులు ఎవరైనా ఆపరేట్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

English summary
prime Minister Narendra Modi is meeting National Security Advisor Ajit Doval, Home Minister Amit Shah, and Defence Minister Rajnath Singh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X