శ్వేతసౌధంలో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం, ద్వైపాక్షిక చర్చలు - స్టేట్ డిన్నర్..!!
ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆత్మీయ స్వాగతం పలికారు. పర్యటనలో రెండో రోజు వాషింగ్టన్ చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు వర్షంలోనూ ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అండ్రూస్ జాయింట్ బేస్ విమానాశ్రయంలో దిగిన ఆయన గౌరవ వందనం స్వీకరించారు. వర్షం పడుతుండటంతో రెయిన్ కోట్ ధరించిన ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఆ తరువాత వైట్ హౌస్ చేరుకున్న ప్రధానిని అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానించారు.
As the official gift, US President Joe Biden and First Lady Jill Biden will present PM Modi with a handmade, antique American book galley from the early 20th Century. President Biden will also gift PM Modi a vintage American camera, accompanied by an archival facsimile print of… pic.twitter.com/OeYWYpXUQp
— ANI (@ANI) June 22, 2023
శ్వేత సౌధంలో ప్రధాని మోదీ:అమెరికాలో ప్రస్తుతం మోదీ మేనియా కొనసాగుతోంది. అమెరికా ప్రభుత్వ అధికారిక ఆహ్వానం మేరకు న్యూయార్క్ చేరిన ప్రధాని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అంతకు ముందే పలువురు ప్రముఖులతో ప్రధాని భేటీ అయ్యారు.

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రధానితో సమావేశమయ్యారు. సాధ్యమైనంత త్వరగా భారత్ కు రావాలనేదే తమ ఆలోచనగా భేటీ అనంతరం వెల్లడించారు. ఆర్దిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రోమెర్ తో జరిగిన భేటీలో భారత్ డిజిటల్ ప్రయాణం, ఆధార్, డిజిలాకర్ వంటి వాటిపైన చర్చ జరిగినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం భారత్ కు సమయమొచ్చిందని ప్రధానితో భేటీ తరువాత ఇన్వెస్టర్ డేలియా అభిప్రాయపడ్డారు.
బైడెన్ తో ప్రధాని చర్చలు:వాషింగ్టన్ చేరుకున్న ప్రధాని నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో కలిసి వేదికను పంచుకొన్నారు మోదీ. భారత్-అమెరికా విద్యార్థులను కలుసుకున్నారు. వారితో ముఖాముఖి భేటీలో పాల్గొన్నారు.
శ్వేతసౌధం వద్ద ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. జిల్లి బైడెన్...జో బైడెన్ తో ప్రధాని మోదీ చర్చలు చేసారు. జిల్లీ బైడెన్ ప్రధాని మోదీకి 20వ శతాబ్దానికి సంబంధించి అమెరికన్ బెక్ గ్యాలరీని బహుమతిగా అందించారు. అధ్యక్షుడు జో బైడెన్ వింటేజ్ అమెరికా కెమేరాను ప్రధాని మోదీకి గిఫ్ట్ గా అందచేసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. భారత్ - అమెరికా బంధంలో ఈ పర్యటన కీలకం కానుందని శ్వేత సౌధం ప్రకటించింది. ద్వైపాక్షిక చర్చలు...పలు నిర్ణయాలు ఈ పర్యటనలో జరగనున్నాయి.

ప్రధానికి ఆత్మీయ విందు:శ్వేతసౌధంలో ప్రధాని మోదీకి గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనకు తన అధికారిక నివాసం వైట్ హౌస్‌లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. డిషెస్ లో ప్రధాని మోదీ నిరంతరం ప్రమోట్ చేసే మిల్లెట్స్ ను ఉంచారు. ఈ రోజు ప్రధాని మోదీ అమెరికన్ జాయింట్ కాంగ్రెస్‌ను సైతం ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. జాయింట్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించబోతోండటం మోదీకి ఇది రెండోసారి.
ఈ రెండు కార్యక్రమాలను అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రవాస భారతీయులతో ప్రధాని సమావేశం కానున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. మోదీ ఫొటోలు.. భారతీయ జెండాలతో అమెరికాలోని ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి అడుగడుగునా అభిమానం చాటుతున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications