మోదీ రూటే సపరేటు: ఎన్నికల స్టంట్‌గా

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిరోజుల కిందటే షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తోన్నారు.

PM Modi met The Elephant Whisperers couple, Bomman and Bellie during his Mudumalai forest trip

ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేకు ఇది సొంత రాష్ట్రం. ఫలితంగా ఈ ఎన్నికలను అటు కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. ఇప్పటివరకు వెలువడిన ఒపీనియన్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ఈ పరిణామాల మధ్య మోదీ ఇవ్వాళ కర్ణాటకలోని బండీపూర్ నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పర్యటించారు. కొత్త లుక్‌లో కనిపించారు. వేటగాడిగా రూపంలో ప్రత్యక్షం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వేళ- ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టయిందనే విమర్శలు ఉన్నాయి.

తలపై హంటర్స్ క్యాప్ ధరించారు. సఫారీ కోసం వినియోగించే కెమెరాతో కర్ణాటకలోని బండీపూర్ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించారు. బండీపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి తమిళనాడు ముడుమళైకి వెళ్లారు. థెప్పక్కాడు ఎలిఫెంట్ క్యాంప్‌ను సందర్శించారు. ఇటీవలే ఆస్కార్ అవార్డును అందుకున్న ది ఎలిఫెంట్ విష్పర్స్ డాక్యుమెంటరీ కపుల్స్ బొమ్మన్-బెళ్లిని కలుసుకున్నారు.

ఈ డాక్యుమెంటరీలో కనిపించిన రఘు అనే ఏనుగుతో కలిసి ఫొటోలు దిగారు. సాధారణంగా బొమ్మన్-బెళ్లిని పలువురు ప్రముఖులు ఇప్పటికే కలుసుకున్నారు. వారిలో ఎవరూ కూడా థెప్పక్కాడు ఎలిఫెంట్ క్యాంప్‌కు వెళ్లేదు. ప్రధాని మోదీ వారికి భిన్నంగా వ్యవహరించారు. తానే స్వయంగా వారు ఉన్న ఎలిఫెంట్ క్యాంప్‌కు వెళ్లి మరీ పలకరించారు. విషెస్ తెలిపారు.

ముడుమళై రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మళ్లీ కర్ణాటకకు చేరుకున్నారు. టైగర్‌ ప్రాజెక్టును ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మైసూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులుల సంరక్షణ కోసం రూపొందించిన ప్రత్యేక విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐబీసీఎ)ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న ఎలిఫెంట్ విష్పర్స్ డాక్యుమెంటరీ ప్రకృతి- వన్యప్రాణుల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని ప్రతిబింబించిందని మన వారసత్వాన్ని ప్రతిబింబించిందని పేర్కొన్నారు. ప్రపంచ భూభాగంలో 2.4 శాతం మాత్రమే ఆక్రమించిన భారత్ ప్రస్తుతం జీవ వైవిధ్యంలో ఎనిమిది శాతం మేర పెరుగుదలకు దోహదం చేస్తోందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+