చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

PM Modi: ఇళయరాజా గారు ఎలా ఉన్నారు, మోదీ పలకరింపు, కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు !

|
Google Oneindia TeluguNews

వారణాసి/చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు, మ్యాస్ట్రో ఇళయరాజాను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఇళయరాజా గారు మీరు బాగున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారా అంటూ ఇళయరాజాను మాట్లాడిన ప్రధాని మోదీ ఆయన నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఇదే సమయంలో తమిళనాడు బీజేపీ శాఖ మీద ప్రధాని నరేంద్ర మోదీ కొంచెం అసహనం చేశారని తమిళ మీడియా అంటోంది. అన్నామలై మోదీకి పాదాభివందనం చేసినా ఆయన్ను మోదీ కనికరించలేదని తెలిసింది. ఉత్తరప్రదేశ్ లోని కాశీలో ఏర్పాటు చేసిన కాశీ తమిళ సంఘం కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. నెల రోజుల పాటు కాశీలో కాశీ తమిళ సంఘం కార్యకలాపాలు జరగనున్నాయి.

Model: స్టార్ హోటల్ లో ప్రియుడిని కాల్చిచంపి నగ్నంగా పరుగు తీసిన టాప్ మోడల్, అసలు మ్యాటర్ ?Model: స్టార్ హోటల్ లో ప్రియుడిని కాల్చిచంపి నగ్నంగా పరుగు తీసిన టాప్ మోడల్, అసలు మ్యాటర్ ?

 కాశీతో తమిళ సంస్కృతికి అనుభంధం

కాశీతో తమిళ సంస్కృతికి అనుభంధం

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని కాశీకి తమిళ సంస్కృతికి దశాభ్దాల అనుభంధం ఉంది. ఆ అనుభంధంతోనే వారణాసిలో కాశీ తమిళ సంఘం పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. శనివారం కాశీలో కాశీ తమిళ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు. తమిళనాడు సంప్రధాయం ప్రకారం తెల్లటి పంచె, తెల్లటి షర్టు వేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తమిళ ప్రజలు ఆకర్షించారు.

 ఇళయరాజా చేతులు పట్టుకుని మాట్లాడని ప్రధాని మోదీ

ఇళయరాజా చేతులు పట్టుకుని మాట్లాడని ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రులు ఎల్, మురుగన్, ధరేంద్ర ప్రధాన్, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాక్రిష్ణన్ తో పాటు తమిళనాడులోని బీజేపీకి చెందిన పలువురు నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు, మ్యాస్ట్రో ఇళయరాజా దగ్గరకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయన చేతులు పట్టుకుని ఆప్యాయంగా పలకరించారు.

 ఎలా ఉన్నారు రాజా గారు

ఎలా ఉన్నారు రాజా గారు

ఇళయరాజాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో సన్నిహితంగా మాట్లాడారు. రాజా గారు మీరు బాగున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారా అంటూ ఇళయరాజాను మాట్లాడిన ప్రధాని మోదీ ఆయన నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను రాజ్యసభకు పంపించిన విషయం తెలిసిందే.

 కాళ్లు ముక్కినా మోదీ కనికరించలేదు

కాళ్లు ముక్కినా మోదీ కనికరించలేదు

మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇదే సందర్బలో ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఏదో చెప్పడంతో అన్నామలై పక్కకు వెళ్లిపోయారు. ప్రతి ఒక్కరిని చేతులు పట్టుకుని పలకరించిన ప్రధాని నరేంద్ర మోదీ అన్నామలైకి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

 ఏం చేస్తున్నారో తెలీదని బీజేపీ హైకమాండ్ ?

ఏం చేస్తున్నారో తెలీదని బీజేపీ హైకమాండ్ ?

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ నాయకులు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అయితే తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై తమిళనాడు ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇవ్వడంలేదని, తమిళనాడు ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపించడంతో విఫలం అయ్యారని కొందరు బీజేపీ నాయకులు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారని తెలిసింది.

 కేంద్ర మంత్రి మురుగన్ మళ్లీ ఎంట్రీ ?

కేంద్ర మంత్రి మురుగన్ మళ్లీ ఎంట్రీ ?

కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ గతంలో తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై పేరుకు మాత్రమే అధ్యక్షుడిగా ఉన్నాడని, ముఖ్యమైన నిర్ణయాలు కేంద్ర మంత్రి అన్నామలై తీసుకుంటున్నారని తెలిసింది. అందుకే అన్నామలైతో ప్రధాని నరేంద్ర మోదీ అంటిముట్టనట్లు వ్యవహరించారని తమిళ మీడియా అంటోంది.

English summary
PM Modi: Narendra Modi welcomes Ilayaraja for Kasi Tamil Sangamam held in Varanasi in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X