మోడీ రాగానే ముఖ్యమంత్రి, శశికళ కన్నీరుమున్నీరు, భుజం తట్టిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం, జయలలిత నెచ్చెలి శశికళలు కండతడి పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయ పార్థీవదేహానికి మోడీ నివాళులు అర్పించారు.

చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం, జయలలిత నెచ్చెలి శశికళలు కండతడి పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయ పార్థీవదేహానికి మోడీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పన్నీరు సెల్వం, శశికళలు ఏడుపు ఆపుకోలేకపోయారు.

వారిద్దరు ఒక్కసారిగా కంటతడి పెట్టడంతో.. ప్రధాని మోడీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం భుజం తట్టి ఓదార్చారు. అనంతరం పలువురు సీనియర్ నేతలు, ఇతరులతో ప్రధాని మోడీ మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

PM Modi pays floral tribute to Jayalalithaa

కాగా, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ఆయన రాజాజీ హాల్‌ వద్ద ఉంచిన జయలలిత పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మోడీ వెంట మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర రావు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారు. సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే జయలలిత అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు.

ఇదిలా ఉండగా, సాయంత్రం నాలుగున్నర గంటలకు మెరీనా బీచ్‌లో జయ అంత్యక్రియలు జరగనున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెన్నై బయలుదేరారు.

PM Modi pays floral tribute to Jayalalithaa

కన్నీరుమున్నీరు అవుతూ పన్నీరు సెల్వం

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం అంతకుముందు నివాళులర్పించారు. రాజాజీ హాల్‌లో అమ్మ పార్థివదేహం వద్ద పుష్ఫగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం జయలలిత పార్థివదేహం పక్కనే కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన అమ్మ ఇక లేదంటూ ఆయన రోదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+