కలాలను చీపుర్లుగా మార్చండి: మీడియాకు పిఎం మోడీ
న్యూఢిల్లీ: జర్నలిస్టులు తమ కలాలను చీపుర్లుగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శనివారం పత్రికా సంపాదకులు, విలేఖరులతో సమావేశం నిర్వహించారు. దీపావళి మిలియన్ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో మీడియా ప్రతినిధులతో ముఖాముఖీ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తాము మీడియాతో సత్ససంబంధాలను కోరుకుంటున్నామని చెప్పారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మద్దతు పలుకుతున్న మీడియాకు ఈ సందర్భంగా మోడీ కృతజ్ఞతలు తెలిపారు. తాము మీడియా నుంచి విజన్, సమాచారం కోరుకుంటున్నామని చెప్పారు. ఒక దేశాన్ని మార్చగల శక్తి మీడియాకు ఉందని.. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రచారం ద్వారా రుజువవుతుందని మోడీ అన్నారు. క్లీన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లో మీడియా భాగస్వామి కావాలని ఆయన కోరారు.
చాలా మంది సంపాదకులు శుభ్రతపై అనేక కథనాలను ప్రచురించారని మోడీ చెప్పారు. పరిశుభ్రతపై పేద ప్రజల్లో అవగాహన కల్పిస్తోందని మీడియాను ప్రశంసించారు. ప్రతీ ఒక్కరూ జీపురు పట్టి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని మోడీ పిలుపునిచ్చారు.
మీ కలాలను చీపుర్లు మార్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని నరేంద్ర మోడీ మీడియా ప్రతినిధులను కోరారు. స్వచ్ఛ భారత్‌ను జాతీయ కార్యక్రమంగా చేపట్టాలని అన్నారు. దేశ అభివృద్ధిలో మీడియా కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఎన్డీఏ పనితీరు వల్లే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో గెలిచామని ఈ సందర్భంగా మోడీ తెలిపారు.












Click it and Unblock the Notifications