ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోడీ రికార్డు..
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం నమీబియాలో పర్యటిస్తున్న పీఎంకి అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ''ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్'' పురస్కారాన్ని మోడీకి ప్రధానం చేశారు. ఈ పురస్కారం పొందిన తొలి భారతీయ నేతగా ప్రధాని మోదీ నిలవడం గమనార్హం. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన అందుకున్న 27వ అంతర్జాతీయ పురస్కారం ఇది. నమీబియా ప్రెసిడెంట్ నెటుంబో నంది మోదీకి ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ నెల 2న ప్రారంభమైన ప్రధాని ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటికే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలను సందర్శించారు. బ్రెజిల్‌లోని రియోలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కూడా పాల్గొన్నారు. ఈ పర్యటనలో అర్జెంటీనా మినహా మిగిలిన నాలుగు దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకోవడం విశేషం. ఈ పురస్కారం పట్ల మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ నెటుంబో నందితో పాటు నమీబియా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 140కోట్ల భారతీయుల తరఫున ఈ పురస్కారాన్ని తీసుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.

కాగా ఈ పురస్కారం తర్వాత.. ప్రెసిడెంట్ నెటుంబో నందితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఖనిజాలు వంటి రంగాలలో పరస్పర సహకారంపై చర్చించారు. వాణిజ్యం, ఎనర్జీ, పెట్రోకెమికల్స్ వంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు. అంతే కాకుండా ఇరుదేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి.
అంతకుముందు బ్రెజిల్ నుంచి నమీబియా చేరుకున్న మోదీకి ఘనస్వాగతం లభించింది. ఆ దేశ ప్రెసిడెంట్ నెటుంబో నంది స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి మోడీని రిసీవ్ చేసుకున్నారు. 21 గన్స్‌తో కూడిన గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మోడీ స్వయంగా డప్పు వాయించి అక్కడున్నవారిని ఉత్సాహపరిచారు.
It was an honour to speak on India-Namibia friendship, our bond with Africa and India’s efforts for global good, during my address to the Namibian Parliament. pic.twitter.com/GQmB6CPDAX
— Narendra Modi (@narendramodi) July 9, 2025
మరోవైపు ప్రధాని మోడీ బ్రెజిల్‌లో రెండు రోజుల పర్యటనను ముగించుకుని నమీబియా చేరుకున్నారు. రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరై.. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications