మోదీ కేబినెట్ ప్రక్షాళన, ఇన్- ఔట్ ఇలా: తెలుగు రాష్ట్రాల నుంచి.. లిస్టులో...!!

కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ తన కేబినెట్ ప్రక్షాళనకు సిద్దం అయ్యారు. పార్లీ పార్లమెంటరీ బోర్డులోనూ మార్పులు చేయనున్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తరువాత ఏ క్షణంలో అయినా కేబినెట్ ప్రక్షాళన జరగనుంది. ఇందులో భాగంగా కసరత్తు తుది దశకు చేరింది. మంత్రి పదవుల నుంచి తప్పించే వారి విషయంలో ఇప్పటి కే ఒక నిర్ణయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి మార్పులు జరగనున్నాయి.

ప్రధాని మోదీ తన కేబినెట్ ప్రక్షాళనకు సిద్దమయ్యారు. సెప్టెంబరు 1వ తేదీన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్రంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.అధికార యంత్రాంగంలో మార్పులతోపాటు గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలు, కేంద్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియామకం దిశగా కసరత్తు జరుగుతోంది. కాగా మోదీ ప్రభుత్వంలో 69 మంది మంత్రులుండగా, రాజ్యాంగం ప్రకారం మరో 12 మందిని నియమించుకునేందుకు అవకాశం ఉంది.

pm-modi-reportedly-to-drop-ministers-aged-70-and-above-may-face-exit-as-bjp-eyes-2029-elections-det

ఇదిలా ఉండగా, 70 ఏళ్ల వయసు దాటిన 12 మందికిపైగా క్యాబినెట్‌, సహాయమంత్రులను తప్పించి యువతకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. జెన్ జీ యూత్ ని ఆకట్టుకోవడం వేగంగా ప్రభుత్వం స్పందించడం అదే విధంగా కేబినెట్ కి యూత్ అట్రాక్షన్ తీసుకుని రావడమే లక్ష్యంగా కీలక మార్పులకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

తమిళనాడు గవర్నర్ గా ఏపీ బీజేపీ ముఖ్య నేత, ఏరి కోరి..!?
తమిళనాడు గవర్నర్ గా ఏపీ బీజేపీ ముఖ్య నేత, ఏరి కోరి..!?

తెలుగు రాష్ట్రాల నుంచి ఛాన్స్ ఎవరికి

మోదీ ప్రస్తుత కేబినెట్ లోని ఇద్దరు మంత్రులకు గవర్నర్లుగా అవకాశం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ నుంచి బీజేపీ నేత.. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి ఖాయమైందని సమాచారం. అదే విధంగా ఏపీ నుంచి టీడీపీ - జనసేన ఎంపీల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కనుంది. జనసేనకు అవకాశం వస్తే వల్లభనేని బాలశౌరీ, టీడీపీ నుంచి ఛాన్స్ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. ఇక.. తెలంగాణలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కు పార్లమెంటరీ పార్టీ బోర్డులో అవకాశం దక్కనుంది. అదే విధంగా డీకే అరుణ, నగేష్, ఈటల రాజేందర్ లో ఇద్దరికి కొత్తగా మంత్రులుగా అవకాశం ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో.. వచ్చే తొలి వారంలో కేంద్రంలో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+