ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం, బెర్లిన్‌కు మరో విమానం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని విదేశీ పర్యటనకు తీసుకు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747-400లో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుండి పారిస్, టౌలోస్, హనోపర్ మీదుగా బెర్లిన్‌కు ప్రధాని మోడీ ఈ విమానంలోనే ప్రయాణించారు.

దానిలో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం ఉదయం మరో విమానాన్ని పంపించారు. ముంబైలో సిద్ధంగా ఉంచిన ప్రత్యామ్నాయ విమానాన్ని పంపించారు. కెనడా పర్యటన నిమిత్తం ఒటావాకు చేరుకునేందుకు ప్రధాని మోడీ, ఆయన వెంట ఉన్న ప్రతినిధులు ఈ విమానాన్ని ఉపయోగిస్తారు.

PM Modi’s Air India One develops snag, standby plane sent

ప్రత్యామ్నాయ విమానంలో కొంతమంది అదనపు సిబ్బందిని ఎయిర్ ఇండియా పంపించింది. ఈ నెల 9న ప్యారిస్‌కు బయలుదేరిన ప్రధాని మోడీ ఈ నెల 18న స్వదేశం రానున్నారు. ప్రోటోకాల్ నిబంధనల మేరకు ఇలా ఒక విమానాన్ని సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+