నేటి నుంచి టీటీడీలో: ఈషా ఫౌండేషన్, బ్రహ్మకుమారీస్ సహకారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 84,468 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 40,203 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.48 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.22 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి.

కాగా.. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి టీటీడీ సన్నాహాలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేక యోగా తరగతులను నిర్వహిస్తోంది. నేడు ఈ యోగా తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దీనిపై టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, ఆరోగ్యకర జీవనశైలికి యోగాభ్యాసం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

Yoga Awareness and Special Training Programs to Be Conducted Daily Under TTD from Today to June 21

21వ తేదీ వరకు ప్రతిరోజూ టీటీడీ ఆధ్వర్యంలో యోగా అవగాహన, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిరాటంకంగా నిర్వహించాలని ఆదేశించారు. యోగాభ్యాసం ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని గుర్తుచేశారు. అన్ని వయస్సుల వారిలో ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చేందుకు యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ఈషా ఫౌండేషన్, పతంజలి యోగపీఠం, రామచంద్ర మిషన్, బ్రహ్మకుమారీస్, టీటీడీ ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఈ సందర్భంగా రవిచంద్ర ఆదేశించారు. టీటీడీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, విద్యార్థులు, యువత, వృద్ధులు, ఆసుపత్రుల్లోని రోగులకు ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

యోగా దినోత్సవానికే పరిమితం కాకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే యోగాపై ఆసక్తి, అవగాహన పెంపొందేలా విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జూన్ 21న ఉదయం 6 గంటలకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+