యూత్ ను ఊపేస్తున్న అన్నామలై ఉద్యమం - విజయ్ కు కొత్త టెన్షన్..!!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీని వీడిన ఫైర్ బ్రాండ్ అన్నామలై నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. అన్నామలైకు మద్దతుగా బీజేపీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇదే సమయంలో అన్నామలై కొత్త ఉద్యమానికి రాష్ట్రంలోని యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. బీజేపీతో పాటుగా డీఎంకే, విజయ్ పార్టీకి ఈ పరిణామాలు అంతు చిక్కటం లేదు. కొత్త సమీకరణాలకు ఇవి దారి తీస్తున్నాయి.
బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై కేంద్రంగా ఇప్పుడు తమిళనాడులో కొత్త రాజకీయం మొదలైంది. బీజేపీతో తనకు 18 నెలలుగా విభేదాలు ఉన్నాయని.. తాను సామాన్యులకు దగ్గరగా రాజకీయం చేస్తానని అన్నామలై ప్రకటించారు. ఆయనకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసారు. అయితే, వారి రాజీనామాతో పార్టీకి నష్టం లేదని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు అన్నామలై తెర తీశారు. 'వుయ్ ద పీపుల్' పేరుతో ఆయన రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించిన 24 గంటల్లోపే సుమారు 15 లక్షలమంది ఆ ఉద్యమానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. బీజేపీ అధిష్ఠానం అన్నామలై రాజీనామాను ఆమోదించిన వెంటనే ఆయన సోషల్ మీడియాలో ప్రజల ముందుకెళ్లి తన రాజకీయ ఉద్యమం గురించి వివరించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యం అంటూ తన కార్యాచరణను ప్రకటించారు.

అన్నామలై కు భారీగా పెరుగుతున్న మద్దతు
మరోవైపు, బీజేపీ నుంచి కొందరు అన్నామలై ప్రారంభించిన ఉద్యమంలోకి తెలిసో తెలియకో తొందరపడి చేరారని, వారంతా ఎప్పుడైనా పార్టీకి తిరిగి రావచ్చునని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నాగేంద్రన్ తెలిపారు. ''అన్నామలై ఉద్యమంలో మా పార్టీకి చెందిన కొంత మంది ఇన్‌చార్జులు, క్షేత్రస్థాయి నాయకులు కూడా చేరినట్లు తెలుసు కున్నాను. తిరిగి వచ్చేయాలని వారందరినీ కోరుతున్నాను.'' అని తెలిపారు. తన ఉద్యమానికి ప్రధాని మోదీ ఆశీస్సులున్నట్లు అన్నామలై ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉన్నదని నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. అయితే, అన్నామలైకు మద్దతు ప్రకటిస్తున్న వారిలో యువత ఎక్కువగా ఉందని గుర్తించారు. దీంతో.. బీజేపీకి మాత్రమే కాదు.. అన్నామలై సెగ పెద్ద ఎత్తున యూత్ మద్దతు తో సీఎం పీఠం దక్కించుకున్న విజయ్ పైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అటు డీఎంకే తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అవసరమైన నిర్ణయాలకు సిద్దం అవుతోంది.












Click it and Unblock the Notifications