వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కశ్మీర్ పై ప్రధాని స్పెషల్ ఫోకస్ - నేటి పర్యటనలో : 370 రద్దు తరువాత తొలిసారిగా..!!

|
Google Oneindia TeluguNews

ప్రధాని మోదీ జమ్ము కాశ్మీర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే 370 అధికరణం ఉపసంహరణ తర్వాత తొలిసారి ప్రధాని జమ్ము కాశ్మీర్ పర్యటన చేస్తున్నారు. రూ.20 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 'జాతీయ పంచాయతీ రాజ్‌' దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు. బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గంను ప్రధాని ప్రారంభిస్తారు. నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ పై ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రధాని మోదీ ప్రత్యేకంగా...

ప్రధాని మోదీ ప్రత్యేకంగా...

ఇప్పటికే అక్కడ 20 సార్లు పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. 2019 ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. రాష్ట్ర హోదాను తొలగించి.. జమ్ము కశ్మీర్, లడక్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. 2019, 2021లో జమ్ముకశ్మీర్ కు వెళ్లినా.. సరిహద్దుల్లో సైనిక బలగాలతో దీపావళి నిర్వహించుకునేందుకే పరిమితమయ్యారు. ఈసారి మాత్రం స్థానికంగా పర్యటించనున్నారు. కశ్మీర్‌ పర్యటనలో మోదీ.. రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ రహదారిని ప్రారంభించనున్నారు.

ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలి సారి

ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలి సారి


రూ.7,500 కోట్లతో నిర్మించనున్న దిల్లీ-అమృతసర్‌-కాట్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారితో పాటు.. చీనాబ్‌ నదిపై నిర్మించనున్న రెండు జలవిద్యుత్‌ ప్రాజెక్టులనూ ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. సుంజ్వాన్‌ ప్రాంతంలో ఇద్దరు జైషే-మహమ్మద్‌ తీవ్రవాదుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ప్రధాని భద్రతను అధికారులు మరింత పటిష్ఠం చేశారు. వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లీ గ్రామం నుంచే గ్రామీణ స్థానిక సంస్థలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
3.

కీలక సందేశం..రాష్ట్ర హోదా పైనా

కీలక సందేశం..రాష్ట్ర హోదా పైనా


జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధిపతి కుల్‌దీప్‌ సింగ్‌ శనివారం సుంజ్వాన్‌ ప్రాంతానికి చేరుకున్నారు. మోదీ పర్యటించనున్న పల్లీ గ్రామానికి వెళ్లి అక్కడి భద్రతా పరిస్థితినీ సమీక్షించారు. సాయంత్రం మోదీ కశ్మీర్‌ నుంచి నేరుగా ముంబయికు చేరుకుంటారు. అక్కడ లతా మంగేష్కర్‌ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మాస్టర్‌ దీనానాధ్‌ మంగేష్కర్‌ అవార్డును అందుకుంటారు. జమ్ము కాశ్మీర్ లో ప్రధాని ప్రసంగంలో ఏ అంశాలను ప్రస్తావిస్తారు.. ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Prime Minister Narendra Modi will on Sunday inaugurate and lay foundation stone of development projects worth over Rs 20,000 crore in Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X