వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఫోటో తొలగింపు దుమారం.. తమిళనాడు పంచాయతీలో పంచాయితీ..

|
Google Oneindia TeluguNews

ఇటీవల ప్రముఖుల ఫోటోలు తొలగించడం పరిపాటిగా మారింది. రాజకీయ వైరంతో ఇలా కొందరు చేస్తున్నారు. మరికొందరు అయితే ఫోటోలు వద్దని అంటున్నారు. తమిళనాడు ఇందులో ప్రత్యేకం.. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా.. జాతీయ పార్టీలకు అంత ఛాన్స్ ఉండదు. అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో సన్నిహితంగా ఉండేది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే పార్టీ అధికారంలో ఉంది.

 PM Modis photo removed from panchayat office in Coimbatore

కోయంబత్తూరు జిల్లా వెల్లలూర్ పంచాయతీలో ఘటన జరిగింది. కనగరాజ్ అనే సభ్యుడు మోడీ ఫోటో తొలగించారు. ఈయన ఇండిపెండెంట్‌గా వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. ఈయనకు అధికార డీఎంకే మద్దతు తెలిపింది. కనగరాజ్ ఫొటో తొలగించడంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

దీనికి సంబంధించి పోతనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. మోడీ ఫోటో తీసివేసినందుకు కనగరాజ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ప్రధాని మోడీ ఫోటో తొలగించడం ఇదీ మొదటిది కాదు. ఇటీవల మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఇంటి యాజమానిని బెదిరించాడు. మోడీ ఫోటో తీసివేయాలని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు తమిళనాడులో అలాంటి ఘటన ఒకటి జరిగింది.

English summary
portrait of Prime Minister Narendra Modi has been removed from Vellalore Town Panchayat office by a ward member in the Coimbatore district, sparking protests by BJP members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X