Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్టీఆర్ పై ప్రధాని మోదీ ప్రశంసలు..!!

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు ప్రధాని మోదీ నివాళి అర్పించారు. రాజకీయాల్లో..సినీ పరిశ్రమలో అద్భుతమైన ప్రతిభతో చెరగని ముద్ర వేసారని కొనియాడారు. ఆదివారం మన్ కీ బాత్ లో ప్రధాని ప్రసంగించారు. మరో వైపు వీర సావర్కర్ సేవల గురించి మోడీ ప్రస్తావించారు స్వాతంత్ర ఉద్యమంలోనే కాదు సామాజిక సమానత్వం కోసం సావర్కర్ చేసిన సేవలు నేటికి గుర్తుండిపోతాయని మోడీ పేర్కొన్నారు. యువ సంగమం పేరుతో విద్యాశాఖ చేపట్టిన కార్యక్రమం గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు.

ఎన్టీఆర్ కు నివాళి : ఈ రోజు ఎన్టీఆర్ శతజయంతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ కు నివాళి అర్పిస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ 101 ఎపిసోడ్ లో ప్రత్యేకంగా ఎన్టీఆర్ ప్రత్యేకతలను ప్రస్తావించారు. బహుముఖ ప్రజ్ఞతో తెలుగు చిత్రసీమలో సూపర్‌స్టార్‌గా నిలవడమే కాకుండా కోట్లాది ప్రజల హృదయాలను కూడా గెలుచుకున్నారుని చెప్పుకొచ్చారు. తన నటన ఆధారంగా అనేక చారిత్రక పాత్రలకు జీవం పోశారు. భగవాన్ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటి అనేక పాత్రలలో ఎన్టీఆర్ నటనని ప్రజలు ఎంతగానో ఇష్టపడ్డారన్నారు. ప్రజలు ఇప్పటికీ ఆయనను గుర్తుంచుకుంటారని వివరించారు. ఎన్టీఆర్ సినీరంగంతో పాటు రాజకీయాల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.

modintr

హృదయాలను ఏలిన ఎన్టీఆర్ : ప్రజల నుండి ప్రేమ, ఆశీర్వాదాలు పొందారని మోదీ పేర్కొన్నారు దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ లక్షలాది ప్రజల హృదయాలను ఏలిన ఎన్టీఆర్ కు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే 25 ఏళ్లు చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. స్వాతంత్ర ఉద్యమంలోనే కాదు సామాజిక సమానత్వం కోసం సావర్కర్ చేసిన సేవలు నేటికి గుర్తుండిపోతాయన్నారు. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ వినేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిని చూపిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. న్యూజిలాండ్ లో వందేళ్ల వృద్దురాలు తన ఫొటోను ఆశీర్వదించారని గుర్తు చేసారు. దేశ వ్యాప్తంగా ప్రజల నుండి నిర్మాణాత్మక సూచనలు, సలహలు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా వచ్చిన విషయాన్ని ప్రధాని వివరించారు.

కొత్త మ్యూజియాల ఏర్పాటు : గత పదేళ్లలో భారతదేశంలో కొత్త మ్యూజియాలు, స్మారక చిహ్నాలను నిర్మించిన విషయాన్ని ప్రదాని గుర్తు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనుల పోరాటాలను వివరించే పది కొత్త మ్యూజియాలను ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రధాని వివరించారు. గురుగ్రామ్ లో ఉన్న మ్యూజియంలో కెమెరాలున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇండియన్ మెమరీ ప్రాజెక్టు 2010లో స్థాపించారని మోడీ గుర్తు చేశారు. ఇది ఒక రకమైన ఆన్ లైన్ మ్యూజియంగా ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పలు మ్యూజియంల గురించి మోడీ ప్రస్తావించారు. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ ఇటు మన్ కీ బాత్ పైన ప్రత్యేక ఆసక్తి కనిపించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+