• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download
LIVE

రాజ్యాంగ దినోత్సవం: దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

|
Google Oneindia TeluguNews

ఈ రోజు నవంబర్ 26వ తేదీ. దేశం రాజ్యాంగ దినోత్సవంను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వేడుకలను ప్రారంభిస్తారు. పార్లమెంటులోని సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముందుగా రాజ్యాంగం యొక్క ప్రవేశికను చదివి వినిపిస్తారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. జాతినుద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముందుగా ప్రసంగిస్తారు.. ఆ సమయంలో ప్రజలు కూడా తనతో పాటుగా ప్రవేశికను చదువుతారు. ప్రధాని మోదీ రెండు రోజుల పాటు జరిగే రాజ్యంగ దినోత్సవ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభిస్తారు. ఇక ఇదే సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, స్పీకర్ ఓంబిర్లాలు కూడా ప్రసంగిస్తారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగే వేడుకలకు సంబంధించి మినిట్ టూ మినిట్ అప్‌డేట్స్ మీకోసం...

PM Modi speech live updates in telugu: PM wishes  the nation on constitution day

Newest First Oldest First
12:48 PM, 26 Nov
తెలంగాణ
72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించారు.
12:39 PM, 26 Nov
ఆంధ్రప్రదేశ్
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. స్వేచ్ఛ, సమానత్వం సంపూర్ణంగా పురివిప్పిన సుదినం. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని, స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ముందుకు సాగుదాం అంటూ సందేశాన్ని ఇచ్చిన కొడాలి నాని.
12:31 PM, 26 Nov
ఢిల్లీ
వీడియో: పార్లమెంట్ సెంట్రల్ హాలులో రాజ్యంగ పీఠికను చదివి వినిపిస్తోన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఆయన గళం కలిపిన ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ఇతర సభ్యులు.
12:14 PM, 26 Nov
ఢిల్లీ
పార్లమెంట్ సెంట్రల్ హాలులో రాజ్యంగ పీఠికను చదివి వినిపిస్తోన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఆయన గళం కలిపిన ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ఇతర సభ్యులు.
12:13 PM, 26 Nov
ఢిల్లీ
ప్రతి మహిళకూ ఓటు వేసే హక్కును కల్పించింది రాజ్యాంగం. దీనితోపాటు చట్టసభలో అడుగు పెట్టే అవకాశాన్నీ కల్పించింది. రాజ్యాంగ రూపకల్పనలో మహిళల పాత్ర కీలకం- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
12:10 PM, 26 Nov
ఢిల్లీ
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర అత్యంత కీలకం. బలమైన ప్రతిపక్షం అంటూ లేకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి.. దేశ ప్రజల అభ్యున్నతి కోసం పని చేయాలి. రాజ్యంగం కూడా ఇదే కోరుకుంటోంది - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
12:07 PM, 26 Nov
ఢిల్లీ
72 సంవత్సరాల కిందట ఇదే రోజు ఇదే పార్లమెంట్ సెంట్రల్ హాలులో రాజ్యాంగం అడాప్ట్ అయింది. ఈ 72 సంవత్సరాల వ్యవధిలోనే దేశం ఎన్నో మార్పులను చవి చూసింది. దానికి అనుగుణంగా రాజ్యాంగంలో సవరణలు చేసింది. అవన్నీ దేశ అభ్యున్నతికి దోహద పడ్డాయి - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
12:04 PM, 26 Nov
ఢిల్లీ
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తోన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
12:01 PM, 26 Nov
ఢిల్లీ
254వ రాజ్యసభ సమావేశాలను జరుపుకొంటున్నాం. సమావేశాల నిర్వహణ రేటు 29.60 శాతం తగ్గింది. 70 శాతం మేర విలువైన సభా సమయాన్ని పోగొట్టుకున్నాం. ఇలాంటి పరిణామం ఏ మాత్రం మంచిది కాదు. సభ సజావుగా సాగాలి. దేశ ప్రజల గళం సభలో వినిపించాలి- ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
11:51 AM, 26 Nov
ఢిల్లీ
దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మూలాధారం రాజ్యాంగం. అన్ని వ్యవస్థలు దీనికి లోబడి నడచుకోవాలి- ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
11:45 AM, 26 Nov
ఢిల్లీ
పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవంలో ప్రసంగిస్తోన్న ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.
11:40 AM, 26 Nov
ఢిల్లీ
ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలి. ప్రతి పౌరుడినీ కార్యోన్ముఖులను చేయడానికి ఈ ఉత్సవాలు ఉపయోగపడతాయి. తాము రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటున్నామా? లేదా? అనే విషయాన్ని సమీక్షించుకోవాలి- ప్రధాని నరేంద్ర మోడీ
11:38 AM, 26 Nov
డామర్ డయ్యూ
ఏ రాజకీయ పార్టీనో.. లేక ప్రధానమంత్రినో ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు ఇది. లోక్‌సభ స్పీకర్ స్వయంగా దీన్ని నిర్వహించారు. ప్రతి సభ్యుడూ ఇందులో పాల్గొనాలి. తదురదృష్టశావ్తతూ కొన్ని పార్టీలు బహిష్కరించాయి. తమ బాధ్యతలను విస్మరించాయి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు స్పీకర్‌కు కృతజ్ఞతలు- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
11:36 AM, 26 Nov
ఢిల్లీ
ప్రతి వ్యక్తీ ఈ దేశ పౌరుడిగా తన బాధ్యతలను విస్మరించకూడదు. రాజ్యాంగంలోని ప్రతి పదాన్నీ గౌరవించుకోవాలి. సమష్ఠిగా రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి కట్టుబడి ఉండాలి- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
11:34 AM, 26 Nov
ఢిల్లీ
స్వచ్ఛ భారత్, మహిళల సాధికారత, ఆత్మనిర్భర్ భారత్, గ్రామాల స్వయం పరిపాలన.. ఇలాంటి వన్నీ జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్నారు. ప్రజల్లో వాటి బీజాలను నాటారు. కాలంతో పాటు ఆ ఆలోచనలు కూడా వటవృక్షంలో ఆవిర్భవించాల్సి ఉంది. కుటుంబ పార్టీలు మాత్రం అధికారం కోసం ఈ వ్యవస్థలను ధ్వంసం చేశాయి- ప్రధాని నరేంద్ర మోడీ
11:31 AM, 26 Nov
ఢిల్లీ
ఇలాంటి పార్టీల గురించి దేశ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను కుటుంబ పార్టీలను అనుసరించవు. రాజకీయాలను స్వలాభం కోసం అన్ని విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయి- ప్రధాని నరేంద్ర మోడీ.
11:29 AM, 26 Nov
ఢిల్లీ
కొన్ని రాజకీయ పక్షాలు.. కుటుంబ పార్టీలుగా మారాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇలాంటి పార్టీలు ఎన్నో ఉన్నాయి. ప్రజల కోసం కాకుండా- కుటుంబం కోసమే వాటిని ఏర్పాటు చేశాయి. కొన్ని తరాలుగా ఒకే కుటుంబం పార్టీని నడిపిస్తోన్న సందర్భాలను చూస్తున్నాం: ప్రధాని నరేంద్ర మోడీ
11:27 AM, 26 Nov
ఢిల్లీ
కొన్ని రాజకీయ పార్టీలు.. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాయి. ప్రతి క్లాజ్‌ను అధిగమిస్తున్నాయి. రాజ్యాంగాన్ని అనుసరించలేని పార్టీలు.. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను ఎలా పాటించగలవు- ప్రధాని నరేంద్ర మోడీ
11:25 AM, 26 Nov
ఢిల్లీ
భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించడానికి రాజ్యాంగమే ప్రధాన కారణం. బీఆర్ అంబేద్కర్.. భారత దేశానికి ఇచ్చిన అతి గొప్ప బహుమతి ఇది. ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది- ప్రధాని నరేంద్ర మోడీ
11:23 AM, 26 Nov
ఢిల్లీ
దేశానికి రాజ్యంగం ఓ చుక్కానిలా మారింది. గ్రామ పంచాయతీ మొదలుకుని పార్లమెంట్ వరకు ప్రతి వ్యవస్థ కూడా రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ స్ఫూర్తిని ఏ మాత్రం విస్మరించలేం. తాము చేసే ప్రతి చర్య, తాము నడిచే ప్రతి మార్గం రాజ్యాంగానికి లోబడి ఉందా? లేదా? అని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది- ప్రధాని నరేంద్ర మోడీ
11:19 AM, 26 Nov
ఢిల్లీ
ఇదే రోజు చోటు చేసుకున్న ముంబై దాడుల గురించీ ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. పలువురు జవాన్లు వీరమరణం పొందారని పేర్కొన్నారు. వారికి ప్రణామాలను అర్పిస్తున్నానని చెప్పారు.
11:17 AM, 26 Nov
ఢిల్లీ
పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రసంగిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాజ్యాంగానికి సాష్టాంగ ప్రణామాలను అర్పించాల్సిన రోజుగా ఆయన అభివర్ణించారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ఆయన స్మరించుకున్నారు. సుదీర్ఘమైన స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది బలిదానాలు చేశారని గుర్తు చేసుకున్నారు.
11:12 AM, 26 Nov
ఢిల్లీ
రాజ్యాంగ దినోత్సవాల్లో పాల్గొనడానికి పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రారంభమైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం. రాజ్యాంగ పీఠికను ఆయన చదివి వినిపిస్తారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తారు. ఈ వేడుకలకు హాజరైన స్పీకర్ ఓం బిర్లా తదితరులు.
11:04 AM, 26 Nov
ఢిల్లీ
రాజ్యాంగ దినోత్సవాల్లో పాల్గొనడానికి పార్లమెంట్ సెంట్రల్ హాలుకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, స్పీకర్ ఓం బిర్లా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సంప్రదాయబద్ధంగా వారికి పార్లమెంట్ సెక్రెటేరియట్ స్వాగతం పలికింది. ఇంకాస్సేపట్లో ప్రారంభం కానున్న రాష్ట్రపతి ప్రసంగం.
11:02 AM, 26 Nov
ఢిల్లీ
రాజ్యంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌తో పాటు ఈ సాయంత్రం 5:30 గంటలకు విజ్ఞాన్ భవన్‌లోనూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం
10:44 AM, 26 Nov
ఢిల్లీ
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను స్మరించుకుంటోన్న దేశ ప్రజలు.
10:35 AM, 26 Nov
ఢిల్లీ
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
10:24 AM, 26 Nov
ఢిల్లీ
దేశంలో రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేసిన బీజేపీ.. అదే రాజ్యాంగ వేడుకలను నిర్వహించడం సరికాదంటూ కాంగ్రెస్ సహా 14 ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తోన్నారు. తాము ఈ ఉత్సవాలను బహిష్కరించినట్లు చెప్పారు.
10:14 AM, 26 Nov
ఢిల్లీ
పార్లమెంట్ సెంట్రల్ హాలులో నిర్వహించబోయే రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు.
9:53 AM, 26 Nov
ఢిల్లీ
పార్లమెంట్ సెంట్రల్ హాలులో నిర్వహించబోయే రాజ్యాంగ దినోత్సవ వేడుకలను బాయ్‌కాట్ చేసిన కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతదళ్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, ముస్లిం లీగ్, డీఎంకే.
READ MORE

English summary
November 26th marks the Constitution day. And President Ramnath Kovind and PM Modi will address the nation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X