Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశంలో కరోనా కల్లోలం: ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, కీలక సమీక్ష

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం తరచూ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. కరోనా కట్టడికి ఆంక్షలు అమలు చేయాలని సూచిస్తోంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతోపాటు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేస్తోంది. పలు రాష్ట్రాలకు కేంద్ర బృందాలను కూడా పంపి పరిస్థితిని సమీక్షిస్తోంది.

Recommended Video

    Omicron: Lockdown పై PM Modi సమావేశం | COVID Cases In India | Oneindia Telugu

    దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో కరోనా పరిస్థితులపై సమీక్షించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాత కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. తమిళనాడులో ఆదివారాలు లాక్‌డౌన్ కొనసాగుతోంది.

     PM Modi To Chair Covid 19 Review Meet With CMs Of All States Today

    కాగా, భారతదేశంలో గత 24 గంటల్లో 1,94,720 కోవిడ్-19 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మంగళవారం నాడు నమోదైన 1.68 లక్షల కేసుల కంటే 15.8 శాతం ఎక్కువ. రోజువారీ పాజిటివిటీ రేటు ప్రతి 100 పరీక్షలకు సోకిన వ్యక్తుల సంఖ్య - 11.5 శాతంగా ఉందని ప్రభుత్వ డేటా చూపిస్తుంది భారతదేశం ఇప్పటివరకు 4,868 ఒమిక్రాన్ వేరియంట్ కేసులను నమోదు చేసినట్లు సమాచారం. ఓ పక్క ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా 5 వేలకు చేరువ కావడం ప్రధానంగా కనిపిస్తుంది .

    మహారాష్ట్రలో అత్యధికంగా ఒమిక్రాన్ వేరియంట్ 1,281 కేసులు, రాజస్థాన్‌లో 645 కేసులు ఉన్నాయి. మంగళవారం నాడు 407 మంది లో కొత్తగా ఈ వేరియంట్ ని గుర్తించారు. ఓమిక్రాన్ కేసుల విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.ఇదిలా ఉంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కనీసం 120 జిల్లాలు మహమ్మారి థర్డ్ వేవ్‌లో వారానికి 10 శాతం పాజిటివ్ రేటును నివేదించాయి.

    మంగళవారం నాడు 17 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరపగా అందులో1,94,720 మంది మా మరి బారిన పడ్డారు. గత 24 గంటల్లో 442 కరోనా మరణాలు సంభవించాయి. కరోనా ఉధృతి కారణంగా ప్రస్తుతం క్రియాశీల కేసులు తొమ్మిది లక్షల మార్కును దాటాయి. క్రియాశీల కేసుల రేటు 2.65 శాతానికి పెరిగిపోయింది. ఇక రోజువారీ కేసులు కంటే రికవరీలు తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నవారు 60,405 మంది. రికవరీ రేటు 96.01 శాతానికి తగ్గింది. మొత్తం గత 24 గంటల్లో 442 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకూ కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 4.84 లక్షలకు చేరుకుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+