కాచిగూడ నుంచి ‘వందేభారత్’కు జెండా ఊపనున్న మోడీ: తెలంగాణలోని ఈ 31 స్టేషన్లకు మహర్ధశ
హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి నంద్యాల జిల్లా డోన్ మీదుగా యశ్వంత్‌పుర్‌కు ఆగస్టు 6న ప్రతిష్టాత్మక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ట్రయల్ రన్‌లో భాగంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 6.30 గంటలకు డోన్‌లో బయల్దేరి 10.30 గంటలకు కాచిగూడకు చేరుకుంది.
ప్రస్తుతం కాచిగూడ స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం-5పై దీన్ని నిలిపి ఉంచారు. ఈ నేపథ్యంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు తెలంగాణలోని 21 స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు రైల్వే వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణలో 31 రైల్వే స్టేషన్లకు అధునాతన హంగులు
దేశంలోని రైల్వే స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అధునాతన సౌకర్యాలతో ఆధునీకరించడం కోసం నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 'అమృత్ భారత్ స్టేషన్స్' పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో మొత్తం 39 స్టేషన్లను గుర్తించి, వీటిని సంపూర్ణంగా ఆధునీకరించాలని నిర్ణయించింది.
తొలి విడతగా తెలంగాణ నుంచి 21 స్టేషన్లకు సంబంధించిన పనులు ఆగస్టు 6వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
'అమృత్ భారత్ స్టేషన్ల' పథకంలో భాగంగా.. స్టేషన్లను ఆధునీకరించడంతోపాటు ప్రయాణీకులు వెయిటింగ్ హాల్స్ (వేచి ఉండే గదులు), టాయిలెట్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించడం, స్థానిక ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించేందుకు 'వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్' దుకాణాలు, ప్రయాణీకులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, స్టేషన్ ముందు, వెనక భాగాల్లో మొక్కల పెంపకం, చిన్న గార్డెన్లు వంటి ఏర్పాట్లు చేస్తారు.
రైల్వే స్టేషన్ల అవసరాలకు అనుగుణంగా బిజినెస్ మీటింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనున్నారు. దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు, సుస్థిర-పర్యావరణ అనుకూల పరిష్కారాలు, పట్టాలకు ఇరువైపులా కాంక్రీట్ బాటలు, దీర్ఘకాలంలో అవసరమయ్యే ఇతర వసతులను కూడా 'అమృత్ భారత్ స్టేషన్ల' పథకంలో భాగంగా చేపట్టనున్నారు.
ఇవికాకుండా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చే 40 ఏళ్ల అవసరాలు తీర్చేవిధంగా అభివృద్ధి చేసేందుకు రూ. 715 కోట్లు, చర్లపల్లి టర్మినల్ అభివృద్ధికి 221 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో గుర్తించిన 39 రైల్వే స్టేషన్లలో.. ఆదిలాబాద్, బాసర్, బేగంపేట్, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్ (నాంపల్లి), జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, లింగపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మలక్‌పేట్, మల్కాజ్‌గిరి, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్‌నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ, తాండూర్, ఉమ్డానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్‌పురా, జహీరాబాద్ ఉన్నాయి.
హైదరాబాద్ (నాంపల్లి) - 309 కోట్లు
నిజామాబాద్ - 53.3 కోట్లు
కామారెడ్డి - 39.9 కోట్లు
మహబూబ్‌నగర్ - 39.9 కోట్లు
మహబూబాబాద్ - 39.7 కోట్లు
మలక్‌పేట్ (హైదరాబాద్)- 36.4 కోట్లు
మల్కాజ్‌గిరి (మేడ్చల్) - 27.6 కోట్లు
ఉప్పుగూడ (హైదరాబాద్)- 26.8 కోట్లు
హఫీజ్ పేట (హైదరాబాద్) - 26.6 కోట్లు
హైటెక్ సిటీ (హైదరాబాద్) - 26.6 కోట్లు
కరీంనగర్ - 26.6 కోట్లు
రామగుండం (పెద్దపల్లి)- 26.5 కోట్లు
ఖమ్మం - 25.4 కోట్లు
మధిర (ఖమ్మం) - 25.4 కోట్లు
జనగాం - 24.5 కోట్లు
యాదాద్రి (యాదాద్రి భువనగిరి)- 24.5 కోట్లు
కాజీపేట జంక్షన్ (హన్మకొండ)- 24.5 కోట్లు
తాండూర్ (వికారాబాద్)- 24.4 కోట్లు
భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)- 24.4 కోట్లు
జహీరాబాద్ (సంగారెడ్డి)- 24.4 కోట్లు
ఆదిలాబాద్ - 17.8 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. తొలి విడతలో 6 ఆగస్టున ప్రధాని చేతుల మీదుగా రూ. 894 కోట్ల వ్యయంతో ఈ 21 స్టేషన్లలో పనులు ప్రారంభం కానున్నాయి.
-
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications