Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Covid-19: మరోసారి సీఎంలతో ప్రధాని మోదీ సమీక్ష -డెల్టా ప్లస్ విజృంభణపై కేంద్రం హైరానా

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం తగ్గుముఖంపట్టినప్పటికీ ప్రమాదం తప్పిపోయినట్లు కాదని కేంద్రం పదే పదే హెచ్చరిస్తున్నా, చాలా రాష్ట్రాలు మళ్లీ పాత బాటలోకి పయనిస్తున్నాయి. ఉత్తరాదిలోని పలు పర్యాటక కేంద్రాలకు జనం పోటెత్తడం, ఆథ్యాత్మిక క్షేత్రాల వద్దా హడావుడి పెరిగిన నేపథ్యంలో కేంద్రం మరోసారి వార్నింగ్ ఇచ్చింది. అటు ఈశాన్య భారతంలో డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి, కొత్త కేసుల పెరుగుదలపైనా కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలోనే..

ఈశాన్య రాష్ట్రాల్లో తాజాగా కొవిడ్ కేసులు పెరుగుతుండటం, ప్రమాదకరమైన డెట్లా ప్లస్ వేరింట్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడి పరిస్థితిపై ఫోకస్ పెంచారు. ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ రివ్యూపై ఇప్పటికే ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పీఎంవో సమాచారం చేరవేసింది.

PM Modi to review Covid-19 situation with CMs of all Northeast states on tuesday

ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌, త్రిపురలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్యంలోని దాదాపు అన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతానికిపైగా నమోదవుతున్నది. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తున్నది. పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారకముందే ఆయా రాష్ట్రాలు చేపట్టాల్సిన జాగ్రత్తను మోదీ నిర్దేశించనున్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 37,154 కేసులు, 724 మరణాలు నమోదయ్యాయి. మొత్తం మరణాలు 4,08,764కు, రికవరీలు 3.01కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 4,50,899 యాక్టివ్ కేసులున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+