భారీగా పెరిగిన ప్రధాని మోడీ ఆస్తులు: ఏ మేర, ఎలా పెరిగాయంటే..?
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. 2021-22 సంవత్సరంలో నరేంద్ర మోడీ చరాస్తుల విలువ రూ. 26.13 లక్షలు పెరిగినట్లు పీఎంవో వెబ్‌సైట్ వెల్లడించింది.

2.23 కోట్లకు పెరిగిన ప్రధాని మోడీ ఆస్తులు
గుజరాత్ రెసిడెన్షియల్ ప్లాట్‌లో ఆయనకు ఉన్న వాటాను విరాళంగా ఇచ్చారని, దీంతో ఆయన పేరిట ఎలాంటి స్థిరాస్తులు లేవని తెలిపింది. మార్చి 31,2022 వరకు ప్రధాని మోడీ చరాస్తుల విలువ రూ. 2,23,82,504కు చేరిందని పీఎంవో వెల్లడించింది. ఇందులో డిపాజిట్ల పెరుగుదల, ఆర్థిక సంస్థ స్థిరత్వం, నేషన్ వైడ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు, జీవిత బీమా కవరేజ్, బీమా పాలసీలు, నగదు ఉన్నాయని పేర్కొంది.

మోడీ ఆస్తులు ఎలా పెరిగాయంటే..?
ప్రధాని మోడీకి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు లేవు. సొంత వాహనం కూడా లేదు. ప్రభుత్వం నుంచి పొందే జీతాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటి వల్ల వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల మోడీ ఆదాయంలో వృద్ధి నమోదైనట్లు తెలుస్తోంది. రూ. 1.73 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలున్నాయి. గతంతో పోలిస్తే ఆయన చేతిలో ఉన్న నగదు విలువ తగ్గింది. గతంలో ఈ నగదు విలువ రూ. 36,900 ఉండగా.. అది ఇప్పుడు రూ. 35,250కి చేరింది.
Recommended Video


కేంద్రమంత్రుల ఆస్తులు ఏ మేర పెరిగాయంటే.?
ప్రధాని మోడీతోపాటు పలువురు కేంద్రమంత్రుల ఆస్తుల జాబితాను ప్రకటించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరిట రూ. 2.54 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఈ సారి ఆయన ఆస్తుల విలువ రూ.29.58 లక్షలు పెరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తులు రూ.1.62 కోట్ల నుంచి రూ.1.83 కోట్లకు పెరిగాయి. పురుషోత్తం రూపాలా ఆస్తుల విలువ రూ.7.29 కోట్లుగా ఉంది. జ్యోతిరాదిత్య సింధియా పేరిట రూ. 35.63 కోట్లు ఉండగా, రూ.58 లక్షల అప్పులు ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తుల విలువ రూ.1.43 కోట్లు అని పేర్కొంది.












Click it and Unblock the Notifications