వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ 2.0 : కరోనాపై యుద్దానికి మోదీ చెప్పిన 7 కీలక సూత్రాలు

|
Google Oneindia TeluguNews

భారత్‌లో దేశవ్యాప్త లాక్ డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కష్ట,నష్టాలకు ఓర్చి ఇప్పటివరకూ లాక్ డౌన్‌కు సహకరిస్తూ వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మరికొద్ది రోజులు కూడా ఇదే స్పూర్తిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు చర్యలు,సోషల్ డిస్టెన్స్,లాక్ డౌన్ కారణంగా.. చాలా దేశాల కంటే భారత్ మెరుగైన స్థితిలోనే ఉందన్నారు. అయితే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు,అధికారులు,ఆరోగ్య నిపుణులతో నిరంతరం చర్చలు జరిపిన తర్వాత లాక్ డౌన్‌ పొడగింపుపై నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కరోనాపై యుద్దంలో ప్రధాని మోదీ 7 కీలక సూత్రాలను ప్రస్తావించారు.

1)
సీనియర్ సిటిజెన్స్ పట్ల తగు శ్రద్ద వహించండి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి.

 PM Modi underlines 7 steps to be followed to fight against coronavirus

2)

లాక్ డౌన్,సోషల్ డిస్టెన్స్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్కులను ఉపయోగించాలి.

3)

ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన మార్గదర్శకాలను పాటించి మీ నిరోధక శక్తిని పెంచుకోండి.

4)
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌ లోడ్ చేసుకోండి.

5)
మీకు సాధ్యమైతే పేద కుటుంబాలకు సాయం చేయండి.

6)
మీ వ్యాపారాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఆదుకోండి. వారిని తొలగించడం వంటి చర్యలకు పాల్పడకండి.

7)
కరోనాపై యుద్దంలో సైనికుల్లా పనిచేస్తున్న డాక్టర్లు,నర్సులు,పారిశుద్ధ్య కార్మికులను గౌరవించండి.

English summary
Prime Minister ends his addresses by asking people to be very vigilant in following the coronavirus lockdown, now extended till May 3. He wished everyone good health against this coronavirus menace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X