ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనల్లో మోదీ- ఆ చర్చికి ఓ ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి

న్యూఢిల్లీ: ఇవ్వాళ ఈస్టర్ సండే.. జీసస్ పునరుత్థానమైన రోజు. గుడ్ ఫ్రైడే తరువాత వచ్చే తొలి ఆదివారాన్ని ఈస్టర్ సండేగా జరుపుకొంటారు క్రైస్తవులు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని చర్చిల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్రల్లో చర్చిలన్నీ భక్తులతో నిండిపోయాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇవ్వాళ ఈస్టర్ సండే ప్రార్థనలకు హాజరయ్యారు. ఈ సాయంత్రం ఆయన దేశ రాజధానిలోని శాక్ర్డ్ హార్ట్ క్యాథడ్రెల్ క్యాథలిక్ చర్చ్‌కు వెళ్లారు. కొవ్వొత్తిని వెలిగించారు. జీసస్ విగ్రహం ముందు కొద్దిసేపు ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఓ ప్రధానమంత్రి- ఈ చర్చికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 PM Modi visited Sacred Heart Cathedral Catholic Church

చర్చికి వచ్చిన ప్రధాని మోదీని బిషప్ అనిల్ ఖుటో, ఫాదర్ ఫ్రాన్సిస్ స్వామినాథన్ సాదరంగా స్వాగతం పలికారు. ఆయనకు శాలువ కప్పి ఆహ్వానించారు. నేరుగా చర్చ్ లోనికి వెళ్లారు. బిషప్ అనిల్ ఖుటో సమక్షంలో కొవ్వొత్తిని వెలిగించి, ప్రార్థనలు చేశారు. అనంతరం బిషప్ అనిల్ ఖుటో, ఫాదర్ ఫ్రాన్సిస్ స్వామినాథన్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సుమారు 40 నిమిషాల పాటు అక్కడే గడిపారు మోదీ.

ఈస్టర్ సండేను పురస్కరించుకుని ఈ ఉదయం మోదీ క్రైస్తవులకు శుభాకాంక్షలను తెలిపారు. ఈస్టర్ సండే జరుపుకోవడం ఓ ప్రత్యేక సందర్భమని వ్యాఖ్యానించారు. సమస్త మానవాళికి, సమాజానికి సామరస్య స్ఫూర్తిని పంచిన రోజుగా అభివర్ణించారు. అణచివేతకు గురవుతున్న వారిని ఆదుకోవాలని, వారికి చేయూత అందించాల్సిన బాధ్యతను ఈస్టర్ సండే గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.

క్రీస్తు పవిత్రమైన ఆలోచనలను స్మరించుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కాగా ఈస్టర్ సండేను పురస్కరించుకుని శాక్ర్డ్ హార్ట్ కేథడ్రల్‌ క్యాథలిక్ చర్చిని అందంగా అలంకరించారు. వందలాది మంది భక్తులు చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. మోదీ రాక సందర్భంగా ప్రొటోకాల్‌ను పాటించారు. ఎంపిక చేసిన భక్తులకు మాత్రమే చర్చిలో ప్రార్థనలకు అనుమతి ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+