సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడి ద్వారకా నగరం మునిగిన చోటికి వెళ్లిన మోదీ

Dwaraka: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తోన్నారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. మరికొన్నింటిని ప్రారంభించారు.

తన రెండు రోజుల పర్యటన సందర్భంగా గుజరాత్‌లో 4,150 కోట్ల రూపాయల విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారాయన. తన పర్యటన సందర్భంగా ఈ ఉదయం చారిత్రాత్మక బెట్ ద్వారక ఆలయాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. ద్వారక నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం.

PM Modi went underwater in the deep Sea and prayed at Dwarka

ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి ఈ ఆలయాన్నిసందర్శించారు మోదీ. ద్వారకాధీశుడి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. ఓఖా మెయిల్ ల్యాండ్ నుంచి బెట్ ద్వారకా ఆలయాన్ని సందర్శిస్తూ నిర్మించిర వంతెన ఇది.

మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. 2017లో దీని నిర్మాణానికి ఆయనే శంకుస్థాపన చేశారు. 978 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ సుదర్శన్ సేతు పొడవు 2.32 కిలోమీటర్లు. దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ఇదే. ఇదివరకు సిగ్నచర్ బ్రిడ్జిగా గుజరాత్ ప్రభుత్వం పేరు పెట్టింది. దీన్ని మార్చింది కేంద్ర ప్రభుత్వం. సుదర్శన్ సేతుగా నామకరణం చేసింది.

PM Modi went underwater in the deep Sea and prayed at Dwarka

బెట్ ద్వారక ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా వసతిని కల్పించడానికి ఈ బ్రిడ్జిని నిర్మించినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందని పేర్కొంది.

అనంతరం ద్వారక సముద్ర తీరంలో స్కూబా డైవింగ్ చేశారు. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరం సముద్ర గర్భంలో మునిగిన చోటికి వెళ్లారు. ప్రార్థనలు చేశారు. నెమలి పింఛాలను అక్కడ వదిలారు. అనంతరం ఈ అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. దేశ ఆధ్యాత్మిక, చారిత్రక మూలాలకు వెళ్లొచ్చానని, శ్రీకృష్ణుడితో అనుబంధం ఉన్న పురాతన నగరానికి ఇది కేంద్ర బిందువు అని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+