బిగ్ న్యూస్ : కరోనా వైరస్‌పై జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం(మార్చి 19) రాత్రి 8గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి,నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ఆయన మాట్లాడే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రం కరోనా వైరస్‌పై అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు మోదీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వైరస్‌ను ఎదుర్కొనేలా భారత్‌ను మరింత బలోపేతం చేసేందుకు అత్యున్నత స్థాయి సమావేశంలో ఉన్నతాధికారులతో చర్చించినట్టు సమాచారం. అలాగే కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ గురించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది.

కరోనా పరీక్షల కోసం మొదట ప్రభుత్వ ల్యాబ్‌లకే అనుమతినిచ్చిన కేంద్రం.. ఆ తర్వాత ప్రైవేట్ ల్యాబ్‌లకు కూడా అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధికారులు ప్రైవేట్ ల్యాబ్స్‌తో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన సలహాలు,సూచనలు చేస్తోంది. సోషల్ డిస్టెన్స్ పాటించాలని పదేపదే ప్రజలకు సూచిస్తోంది.

pm modi will Address Nation Today At 8 pm over coronavirus outbreak

Recommended Video

    5 Minutes 10 Headlines || KCR Nominates Kavitha As MLC || Virus Impact On Indians Abroad

    వైరస్ నియంత్రణ కోసం భారత్ చేస్తున్న కృషిని డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. స్వయంగా ప్రధాని కార్యాలయం సహా అత్యున్నత స్థాయి అధికారులంతా నిబద్దతతో పనిచేస్తున్నారని డబ్ల్యూహెచ్ఓలో భారత ప్రతినిధి హెంక్ బెక్‌దామ్ అన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ,మహారాష్ట్ర,కర్ణాటక,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,ఒడిశా వంటి రాష్ట్రాల్లో మాల్స్,థియేటర్స్,విద్యా సంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే అనవసర ప్రయాణాలు,ఫంక్షన్లు రద్దు చేసుకోవాలని ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. కరోనా వైరస్‌పై సర్వత్రా ఆందోళన నెలకొన్న వేళ.. ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+