MH Elections: ప్రధాని మోదీ కొత్త వరాలు - గేమ్ ఛేంజర్..!!
ప్రధాని మోదీ మహారాష్ట్ర పై గురి పెట్టారు. త్వరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. శనివారం రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని ఒకే రోజు దాదాపు రూ 56,100 కోట్ల మేర విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు చేయనున్నారు. అటు హర్యానా..జమ్ము ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 8న ఫలితాలు రానున్నాయి. త్వరలో మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో..బీజేపీ నాయకత్వం అప్రమత్తం అయింది.
ఎన్నికల టూర్
మహారాష్ట్రలో ఎన్నికల వేడి పెరుగుతుంది. దసరా తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలో అయినా విడుదలయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు నేపథ్యంలో బిజెపి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా ప్రధానమంత్రి మోడీ ఈరోజు మహారాష్ట్రలో పర్యటన కీలకంగా మారుతుంది. మోడీ తన ఒక్క రోజు పర్యటనలో వాషిమ్, ముంబై, థానే లో దాదాపు రూ 56,100 కోట్ల మేర విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

వరుస ప్రారంభోత్సవాలు
వాషిమ్ లో వ్యవసాయ, పశువర్ధ క రంగాలకు సంబంధించి రూ 23,300 కోట్ల మేర పనులు ప్రారంభించ నున్నారు. అదేవిధంగా థానే పట్టణ అభివృద్ధికి రూ 32 వేల ఎనిమిది వందల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. దీంతోపాటుగా 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 18 వ విడత నిధులను ప్రధానమంత్రి విడుదల చేయనున్నారు. జేవీఎల్ఆర్ నుండి బి కే సి వరకు ముంబై మెట్రో లైన్ మూడవ ఫేస్ ఒకటవ సెక్షన్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. దాదాపు 12,200 కోట్లతో థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
ఎన్నికల చర్చలు
వ్యవసాయ మౌలిక వసతుల నిధి కింద రూ 1920 కోట్ల విలువైన 7500 ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఎన్నికల పొత్తుల పైన చర్చలు మొదలయ్యాయి. ఎన్సీపి చీలిక నేత అజిత్ పవార్ తో హోమ్ మంత్రి అమిత్ షా సీట్ల సర్దుబాటు పైన ప్రాథమికంగా చర్చించారు. దసరా తర్వాత అధికారికంగా సీట్ల పంపకాలపైన నిర్ణయం తీసుకోనున్నారు. మహారాష్ట్రలో తిరిగి అధికారం దక్కించుకోవాలని లక్ష్యంతో బిజెపి వ్యూహాలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా ప్రధాని మోడీ ఈ రోజున మహారాష్ట్రలో చేయనున్న ప్రారంభోత్సవాలు పార్టీకి కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications