వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దసరా ధమాకా ఆఫర్‌ను ప్రకటించిన ప్రధాని మోదీ..!!

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశం యావత్తూ దసరా పండగ కోలాహలం నెలకొంది. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ దసరా పండగ సందడి కొనసాగుతోంది. ఏపీలో భవానీ దీక్షలు, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు, కర్ణాటకలోని మైసూరులో రాజదర్బార్, గుజరాత్‌లో గర్భ నృత్యాలు, పశ్చిమ బెంగాల్‌లో కాళిక అమ్మవారి మండపాలు.. ఇలా వేర్వేరు చోట్ల వివిధ రూపాల్లో దసరా పండగను జరుపుకొంటోన్నారు ప్రజలు. అక్టోబర్ 5వ తేదీన విజయదశమితో దేవీ శరన్నవరాత్రులు ముగుస్తాయి.

దసరా కానుకగా..

దసరా కానుకగా..


ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దసరా కానుకను ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న 5జీ సర్వీసులను ఆయన అందుబాటులోకి తీసుకుని రానున్నారు. దీనికి తేదీ కూడా ఖరారైంది. శనివారమే ఆయన 5జీ సేవలను ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా ఈ లేటెస్ట్ 5జీ సర్వీసులను లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఈ 9 నగరాల్లో..

దీనితో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌ సదస్సును కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఇది 6వ ఎడిషన్. అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు ఈ సదస్సు కొనసాగుతుంది. కాగా- తొలి విడతలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన తొమ్మిది నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ జాబితాలో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, గాంధీనగర్, గుర్‌గావ్, హైదరాబాద్, జామ్‌నగర్, లక్నో, పుణే నగరాలు ఉన్నాయి. మిగిలిన నగరాల్లో ఈ ఏడాడి డిసెంబర్ నాటికి దశలవారీగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.

జియో, ఎయిర్‌టెల్..


దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ సారథ్యంలోని జియో, సునీల్ భారతి మిట్టల్‌కు చెందిన ఎయిర్‌టెల్ ఇప్పటికే తమ 5జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధం అయ్యాయి. ఈ విషయంలో వొడాఫోన్-ఐడియా కాస్త వెనుకంజలో ఉంటోంది. 5జీ ప్లాన్ల ధరలు 4జీతో సమానంగా ఉంటోన్నాయి. ఇప్పటివరకు టెలికం కంపెనీలేవీ తమ 5జీ ప్లాన్ల ధరలను వెల్లడించలేదు. 5జీని ప్రారంభించిన తరువాత దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదివరకే వేలం..

5జీ సర్వీసుల కోసం ఉద్దేశించిన స్పెక్ట్రమ్‌‌ను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే వేలం వేసిన విషయం తెలిసిందే. 4జీతో పోల్చుకుంటే 10 రెట్ల వేగం ఉంటుంది 5జీకి. 20 సంవత్సరాల పాటు కాల పరిమితితో ఈ వేలం పాటలను టెలికాం శాఖ నిర్వహించింది. 72097.85 మెగా హెర్ట్జ్ సామర్థ్యం గల స్పెక్ట్రమ్‌ 5జీని వేలానికి ఉంచింది. మొత్తం మూడు ఫ్రీక్వెన్సీల్లో ఈ వేలంపాటకు వచ్చాయి.

మూడు ఫ్రీక్వెన్సీల్లో..

మూడు ఫ్రీక్వెన్సీల్లో..

లో- రేంజ్‌ అంటే.. 600, 700, 800, 900, 1800, 2100, 2300 మెగా హెర్ట్జ్, మిడ్ రేంజ్‌ అంటే.. 3300 మెగా హెర్ట్జ్, అలాగే హై రేంజ్ అంటే.. 26 గిగా హెర్ట్జ్ సామర్థ్యంతో ఈ స్పెక్ట్రమ్ వేలంపాట ఉంటుంది. మిడ్ అండ్ హై బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను టెలికం సర్వీస్ ప్రొవైడర్స్‌ వినియోగించుకునే అవకాశం ఉంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం పాటలో టెలికం బిగ్ షాట్స్ పాల్గొన్నాయి. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో, గౌతమ్ అదాని నాయకత్వాన్ని వహిస్తోన్న అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు పోటీలో నిల్చున్నాయి.

5జీ నెట్‌వర్క్ కోసం..

దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరింపజేయడానికి రెండు లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టబోతోన్నామని ముఖేష్ అంబానీ ఇప్పటికే ప్రకటించారు. తొలి దశలో 5జీ నెట్‌వర్క్‌లో విస్తరింపజేయడానికి ప్రత్యేకంగా డెడికేటెడ్ సొల్యూషన్ టీమ్స్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నెట్‌వర్క్ ప్లానింగ్‌లో 3డీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీ వంటి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో పైలెట్ ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేశామని వివరించారు.

English summary
Prime Minister Narendra Modi will launch 5G services on 1st October. He will also inaugurate the 6th edition of the Indian Mobile Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X