నేడు బీహార్‌లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌..

బీహార్‌లో నేడు ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌టించ‌నున్నారు. ప్రధాని పర్యటనపై బీజేపీ కార్యకర్త‌లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. బీహార్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ న‌వాడాలో జ‌ర‌గ‌బోయే భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం.బీహార్‌లో ఇప్ప‌డు ప్ర‌ధాని రెండ‌వ సారి ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ పర్య‌ట‌న‌లో భాగంగా బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూర్‌కు మద్దుతుగా మోడీ ప్ర‌చారం చేయ‌బోతున్న‌ట్లుగా తెలుస్తోంది.

నవాడాలో జ‌రిగే భారీ బ‌హిరంగ స‌భ‌లో బీజేపీ నేతలతో పాటు ఎన్డీయే కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీల సభ్యులు కూడా పాల్గొన‌బోతున్నారు. ఏప్రిల్ 4వ తేదీన జాముయి స్థానం నుంచి ఎన్‌డిఎ తరపున లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మోడీ ప్రారంభించి సంగ‌తి తెల‌సిందే. ఇక, నవాడాలో జ‌రిగే భారీ బ‌హిరంగ స‌భ కార‌ణంగా ఇక్క‌డ అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి దశ లోక్‌సభ ఎన్నికలలో భాగంగా ఏప్రిల్ 19వ తేదీన గయా, ఔరంగాబాద్, జాముయితో పాటు నవాడా లోక్‌సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. ఇక‌, శ్రీరామ నవమికి ​​ముందు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ నవాడ నుంచి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ప్ర‌ధాని మోడీ రెండోసారి న‌వాడ ప‌ర్య‌ట‌న‌పై బీజెపి అభ్య‌ర్థులు, కార్య‌క‌ర్త‌లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

PM Modi s visit to Bihar today

స‌భలో ప్ర‌సగించ‌నున్న ప్ర‌ధాని...

ఎన్టీయే కూటమి తరపున ప్రధాన మంత్రి బహిరంగ సభలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్‌ఎల్‌ఎంఓ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ, హెచ్‌ఏఎం జాతీయ అధ్యక్షుడు సంతోష్ మాంఝీ, ఎల్‌జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో ప్రసంగించనున్నారు. ఇక‌, ఈ వేదికపై బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి కూడా పాల్గొననున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా స‌భ‌లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అందించిన సౌకర్యాలు, ప్రగతికి చేసిన కృషి గురించి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్రజలకు వివరంగా చెప్పనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గిరిరాజ్ సింగ్‌కు అనుకూలంగా ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రచారం చేయనున్న‌ట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+