వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు ఎన్నీ, ఆ ఖర్చెంతంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019 నుంచి ఇప్పటి వరకు 21 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ చేసిన ఈ పర్యటనలకు ప్రభుత్వం చేసిన ఖర్చు.. రూ. 22.76 కోట్లు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019 నుంచి ఇప్పటి వరకు 21 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ చేసిన ఈ పర్యటనలకు ప్రభుత్వం చేసిన ఖర్చు.. రూ. 22.76 కోట్లు. ఈ మేరకు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ పార్లమెంటులో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.

మోడీ విదేశీ పర్యటనలు ఎన్నీ, ఖర్చెంత?

మోడీ విదేశీ పర్యటనలు ఎన్నీ, ఖర్చెంత?

ఈ నాలుగేళ్లలో ప్రధాని మొత్తం 21 సార్లు విదేశాల్లో పర్యటించగా.. kp. 22.76 కోట్లు ఖర్చు చేశారు. ఈ పర్యటనల్లో జపాన్‌కు మూడు సార్లు, అమెరికాకు రెండుసార్లు, యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కు రెండు సార్లు వెళ్లినట్లు కేంద్రమంత్రి మురళీధరన్ రాజ్యసభలో పేర్కొన్నారు.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటనలు, ఖర్చు ఇది

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటనలు, ఖర్చు ఇది

ఇదిలా ఉండగా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎనిమిది విదేశీ పర్యటనలకు గానూ రూ. 6.24 కోట్లు (సుమారు $845,000) ఖర్చు చేశారు. అదే సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 86 విదేశీ పర్యటనలు చేశారు, దీని ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.20,87,01,475 (సుమారు $2.8 మిలియన్లు) ఖర్చు అయింది.రాష్ట్రపతి కోవింద్ ఒకసారి యూకేను సందర్శించారు. ఈ పర్యటనలు ఇతర దేశాలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుత భారత రాస్ట్రపతి ద్రౌపది ముర్ము గత సెప్టెంబర్‌లో యూకే సందర్శించారు.

యూనిఫాం సివిల్ కోడ్‌ అమలుపై కేంద్రం ఏమందంటే?

యూనిఫాం సివిల్ కోడ్‌ అమలుపై కేంద్రం ఏమందంటే?

మరోవైపు, యూనిఫాం సివిల్ కోడ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం గురువారం రాజ్యసభకు తెలియజేసింది.

యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి సిఫార్సులు చేయాలని ప్రభుత్వం 21వ లా కమిషన్‌ను కోరిందని న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

అయితే, "21వ లా కమిషన్ పదవీకాలం 2018 ఆగస్టు 31తో ముగిసింది. లా కమిషన్ నుంచి అందిన సమాచారం ప్రకారం, యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించిన అంశాన్ని 22వ లా కమిషన్ పరిశీలనకు తీసుకోవచ్చు" అని ఆయన చెప్పారు.

అందువల్ల యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. కాగా,
2014, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్నికల వాగ్దానాలలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు ఒకటి.

English summary
PM Narendra Modi's abroad Trips Cost Over Rs 22.76 Crore Since 2019, central Govt Tells Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X