రాష్ట్రపతి నామినేషన్: తొలి సెట్‌పై మోడీ, రెండో సెట్‌పై బాబు సంతకం
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం(జూన్23న) నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశం అనంతరం ఆపార్టీ జాతీయ అధ్యక్షడు అమిత్‌షా ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మంగళవారం బీహార్ గవర్నర్‌గా ఉన్న రామ్‌నాథ్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 23న ఉదయం 11గంటలకు ఆయన మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.

రామ్‌నాథ్‌ను ఎన్డీయే అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ తొలి నామినేషన్ సెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ సంతకం చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు.
కాగా, రెండో నామినేషన్ సెట్‌పై చంద్రబాబు సంతకం చేయనున్నారు. మూడో సెట్‌పై అమిత్‌షా, నాలుగో సెట్‌పై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ సంతకాలు చేయనున్నారు. ఇది ఇలా ఉండగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ స్పీకర్ మీరా కుమార్ లేదా మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండేను ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications