ఒకే చోట మోదీ, పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం, డేట్లు మాత్రం మార్చేసిన హైకమాండ్, ఎందుకంటే !
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని రోజులే మిగిలుంది. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిక్కబళ్లాపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థులు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. మరికొద్ది రోజుల్లో చిక్కబళ్లాపురంలో స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగతున్న సందర్బంలో ఆ నియోజక వర్గంలో రచ్చరచ్చ జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పవర్ స్టార్ పవణ్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్ చేశారు.
బీజేపీ -జేడీఎస్ కూటమి అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ నామినేషన్ సమర్పించిన సమయంలో కొందరు రాష్ట్ర నేతలు చిక్కబళ్లాపురం వచ్చి వెళ్లడమే కాకుండా జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు నియోజకవర్గంపై ఇంకా దృష్టి పెట్టలేదు. అయితే చివరి నిమిషంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను పిలిపించి భారీ సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించి ఎలాగైనా చిక్కబళ్లాపురం నియోజక వర్గాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

చిక్కబళ్లాపురం లోక్‌సభ ఎన్నికల జోరు తారాస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హెచ్‌డీ కుమారస్వామి, సిద్దరామయ్య, డీకే శివకుమార్ తదితరులు ఓట్ల కోసం ఎన్నికల ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. చిక్కబళ్లాపురం లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండటంతో ఇక్కడ రాజకీయాలు రాయలసీమ టైపు రాజకీయాలు ఇప్పటికే ఉండటంతో ఆ ప్రాంతంలో ఎన్నికల వాతావరణం రసవత్తరంగా ఉంది. చిక్కబళ్లాపురంలో ఇప్పుడు బీజేపీకి సిట్టింగ్ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడం సవాలుగా మారింది.
ఇప్పటికే చిక్కబళ్లాపురం నియోజక వర్గం వ్యాప్తంగా హోరాహోరీగా ప్రచారంలో నిమగ్నమైన ఎన్డీయే అభ్యర్థి, మాజీ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. జేడీఎస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి బీజేపీ అభ్యర్థి సుధాకర్ నామినేషన్ పత్రాల సమర్పించే సమయంలో చిక్కబళ్లాపురం వచ్చి రోడ్ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి చిక్కబళ్లాపూర్ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి సిద్దం అయ్యారు.

చిక్కబళ్లాపురంలో పాటు నెలమంగళ, దొడ్డబళ్లాపూరం, బాగేపల్లి, పేరేసండ్ర, దేవనహళ్లితోపాటు పలుచోట్ల మాజీ సీఎం కుమారస్వామి రోడ్ షోలు, ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆగస్ట్ 17వ తేదీన బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చెయ్యడానికి కర్ణాటకకు వస్తున్నారు. ఈనెల 17వ తేదీన బుధవారం చిక్కబళ్లాపురంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ రోడ్ షో నిర్వహించి ఎన్డీయే అభ్యర్థి సుధాకర్ తరపున ఆయన ప్రచారం చేయనున్నారు.
పవన్ కల్యాణ్ చిక్కబళ్లాపురం పర్యటన ఖరారు కావడంతో ఆయన అభిమానులతో పాటు బీజేపీ నాయకులు చిక్కబళ్లాపురంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. చిక్కబళ్లాపురం లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్‌కి సరిహద్దులో ఉండటంతో ఆ ప్రాంతంలో లక్షలాది మంది పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ఉండడంతో ఆయన ప్రచారం కూడా బీజేపీకి ఉపయోగపడుతుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగి జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఎన్డీయే అభ్యర్థి డాక్టర్ సుధాకర్ రెడ్డి తండ్రి, చిక్కబళ్లాపురం జిల్లా మాజీ అధ్యక్షుడు పీ.ఎన్. కేశవరెడ్డి, ఆయన సతీమణి డాక్టర్ ప్రీతి సుధాకర్ రెడ్డితో పాటు పలువురు కుటుంబ సభ్యులు, బంధువులు చిక్కబళ్లాపురం లోక్ సభ నియోజకవర్గం వ్యాప్తంగా సంచరిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రక్షరామయ్య తండ్రి ఎంఆర్ సీతారాం హోరాహోరీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్ ఆర్ సీతారాం కుటుంబం కూడా చిక్కబళ్లాపురం లోక్ సభ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తోంది.

కాంగ్రెస్ శిబిరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తదితరులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రక్షరామయ్యకు మద్దతుగా నియోజకవర్గం మొత్తం తిరుగుతూ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పలువురు స్టార్ క్యాంపెయినర్లను చిక్కబళ్లాపురం పిలిపించి ఎన్నికల ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ కమెడియన్ డాక్టర్ బ్రహ్మానందం హైదరాబాద్ నుంచి చిక్కబళ్లాపురం వచ్చి బీజేపీ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు.
అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బ్రహ్మానందం రావడం అనుమానంగానే ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగస్టు 18వ తేదీన చిక్కబళ్లాపురంర్ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం చేయనున్నారు. అలాగే ఇప్పటికే పలువురు మంత్రులు చిక్కబళ్లాపురం వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలోని మరికొంతమంది మంత్రులు చిక్కబళ్లాపురం వెళ్లి ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ చిక్కబళ్లాపురంలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 20వ తేదీన చిక్కబళ్లాపురం లోక్‌సభ నియోజకవర్గానికి చేరుకుని ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు. చిక్కబళ్లాపురంలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. చిక్కబళ్లాపురంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున మోదీ ఆదే ప్రాంంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పెద్దఎత్తున సన్నాహాలు చేసి బలప్రదర్శనతో పాటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications