మోడీ ఫొటోగ్రాఫరైన వేళ: కెమెరాను క్లిక్ అనిపించారు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అకస్మాత్తుగా ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తారు. బిజెపి అధికారిక ఫొటోగ్రాఫర్ అజయ్ కుమార్ సింగ్ ఓ సమావేశంలో ప్రధాని మోడీ ఫొటోలు తీస్తూ హడావిడిగా ఉన్నారు. అకస్మాత్తుగా మోడీ ఆ ఫోటోగ్రాఫర్ వద్దకు వచ్చారు. కెమెరాను అతని నుంచి తీసుకున్నారు.
ఆ సంఘటనకు ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయారు అజయ్ కుమార్ సింగ్. అశ్చర్యంతో చూస్తున్న ఫొటోగ్రాఫర్ ఫొటోలను మోడీ కెమెరాలో బంధించారు. టకటకా అతని ఫొటోలను తీశారు. ఈ సంఘటన శనివారం ఉదయం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జరిగింది.

ఈ సంఘటన అనంతరం అజయ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఇది తనకు అతి పెద్ద దీపావళి కానుక అని అన్నారు. తన ఫొటోను మోడీ చాలా బాగా తీశారని, తాను దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటానని ఆయన అన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ తొలిసారి దేశరాధని ఢిల్లీలో మోడీ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తన ఫొటోలు తీస్తున్న అజయ్ కుమార్ సింగ్ నుంచి కెమెరాను తీసుకుని ఇప్పుడు నేను నీ ఫొటో తీయాలని అన్నారు. ఆ తర్వాత మోడీ అజయ్ కుమార్ సింగ్‌తో ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు.
దీపావళి మిలన్ అంటూ బిజెపి కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో పాటు సీనియర్ మంత్రులు, పార్టీ నాయకులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications