వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాక్టరేట్ తిరస్కరించిన మోడీ, 'బుల్లెట్ రైలుకి టైంకాదు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

వారణాసి: ప్రముఖ బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) ప్రతిపాదించిన గౌరవ డాక్టరేట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరస్కరించారు. ఇలాంటి పట్టాలను స్వీరించకూడదనే తన విధానంలో భాగంగానే ప్రధాని దీనిని తిరస్కరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న స్నాతకోత్సవానికి బిహెచ్‌యు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ప్రధాని స్నాతకోత్సవానికి హాజరవుతారని, అయితే గౌరవ డాక్టరేట్‌ను మాత్రం స్వీకరించబోరని అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

PM Narendra Modi declines to accept honorary doctorate from Banaras Hindu University

బుల్లెట్‌ రైలుకు ఇది సమయం కాదు: శ్రీధరన్‌

దేశంలో బుల్లెట్‌ రైలుకు ఇది సరైన సమయం కాదని, దానికి బదులు భారత రైల్వేలో సౌకర్యాలను మెరుగుపరచాలని ఢిల్లీ మెట్రో మాజీ ప్రధానాధికారి శ్రీధరన్‌ పేర్కొన్నారు. గురువారం నాగ్‌పూర్‌లో ఒక వేడుకకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది నుంచి పదేళ్ల అనంతరం బుల్లెట్‌ రైళ్లు అవసరమవుతాయన్నారు.

English summary
Prime Minister Narendra Modi has declined to receive an honorary doctorate from Banaras Hindu University, citing his policy of not accepting such degrees, official sources said here today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X