శతృదుర్భేద్యం- మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం..
PM Narendra Modi: దేశ నౌకాదళం ఇక మరింత శక్తిమంతమైంది. సముద్ర జలాల్లో గస్తీని పెంచడం, ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేలా రూపుదిద్దుకుంటోంది. చైనా దక్షిణ సముద్ర తీర ప్రాంతం నుంచి ముప్పు పొంచివున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత శక్తిమంతమైన మూడు యుద్ధనౌకలు బరిలోకి దిగాయి.
ఈ మూడింటినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే జాతికి అంకితం చేశారు. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో పాల్గొనడానికి ఈ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకున్నారాయన. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తొలుత- నౌకాదళాధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్- ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, ఈ క్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దేశ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్‌పోర్ట్స్ సామర్థ్యం రెట్టింపు అవుతోందని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో దలాది కొత్త నౌకలు, కొత్త కంటైనర్లు అవసరమౌతాయని మోదీ పేర్కొన్నారు. వాటిని తయారు చేసుకునే క్రమంలో దేశవ్యాప్తంగా గల అన్ని పోర్టులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఊతమివ్వబోతోన్నాయని అన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని అన్నారు.
జనావాసాలకు దూరంగా ఉంటూ వస్తోన్న దీవులను కూడా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతను ఇస్తోన్నామని మోదీ చెప్పారు. సముద్రాలపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి సముద్రయాన్ ప్రాజెక్ట్‌ను చేపట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనివల్ల సముద్ర గర్భంలో 6,000 అడుగుల లోతున చోటు చేసుకునే పరిణామాలపై అధ్యయనం చేయవచ్చని చెప్పారు.
అతి కొద్ది దేశాలు మాత్రమే ఈ దుర్భేధ్య మిషన్‌ను చేపట్టాయని, వాటి సరసన భారత్ కూడా చేరుతుందని మోదీ అన్నారు. అనంతరం ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్- నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్‌షేర్ యుద్దనౌకలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి జాతికి అంకితం చేశారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications