వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్ ప్రారంభించిన మోడీ: విశేషాలివే

|
Google Oneindia TeluguNews

వారణాసి: ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌక 'ఎంవీ గంగా విలాస్'ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. వారణాసిలో మొదలైన ఈ గంగా విలాస్ ప్రయాణాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు మోడీ. భారతదేశంలో కొత్తతరం పర్యటకానికి ఇది నాంది పలుకుతోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక, ఇది కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు.

గంగా విలాస్‌లో తొలుత ప్రయాణించేది స్విస్ పర్యాటకులే

గంగా విలాస్‌లో తొలుత ప్రయాణించేది స్విస్ పర్యాటకులే

దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇటువంటి నదీ పర్యాటక నౌకలు రానున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ గొప్పతనాన్ని స్వయంగా అస్వాదించవచ్చునని విదేశీ పర్యటకులకు ప్రధాని ఆహ్వానం పలికారు. పర్యాటకులు తాము ఊహించినదానికంటే ఎక్కువగానే ఆనందం పొందుతారని స్పష్టం చేశారు. మనదేశంలో తయారైన ఈ తొలి నౌకలో స్విట్జర్లాండ్ కు చెందిన 32 మంది పర్యాటకులు మొదటి ప్రయాణాన్ని చేయనున్నారు.

గంగా విలాస్.. 50 ప్రసిద్ధ పర్యాటకు ప్రదేశాలు వీక్షించవచ్చు

గంగా విలాస్.. 50 ప్రసిద్ధ పర్యాటకు ప్రదేశాలు వీక్షించవచ్చు

వారణాసి నుంచి మొదలై అసోంలోని దిబ్రూగఢ్ వరకు వీరి ప్రయాణం కొనసాగుతుంది. మధ్యలో బంగ్లాదేశ్ జలాల్లోనూ ఈ కౌక పయనిస్తుంది. రెండు దేశాల్లో 27 నదులు గుండా సాగే గంగా విలాస్ ప్రయాణ మార్గంలో 50 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంటుంది. 18 సూట్లు ఉండే ఈ నౌకలో 36 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు.

గంగా విలాస్.. 51 రోజులకు రూ. 20 లక్షల ఖర్చు

గంగా విలాస్.. 51 రోజులకు రూ. 20 లక్షల ఖర్చు


మూడు సన్ డెక్ లు, జిమ్ సెంటర్ తోపాటు స్పా వంటి లగ్జరీ సదుపాయాలు కూడా నౌకలో ఉన్నాయి. 51 రోజులపాటు 3200 కిలోమీటర్ల దూరం సాగే ఈ ప్రయాణంలో ఒక్కొక్కరికి ప్రతి రోజు రూ. 25 వేల నుంచి రూ. 50వేల వరకు ఖర్చవుతుంది. మొత్తంగా 51 రోజులపాటు కొనసాగే ఈ ప్రయాణంలో ఒక్కొక్కరికి సుమారు రూ. 13 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని నౌక నిర్వాహకులు తెలిపారు.

గంగా విలాస్ ప్రయాణం భారత్-బంగ్లాదేశ్.. వారసత్వ ప్రదేశాలు

గంగా విలాస్ ప్రయాణం భారత్-బంగ్లాదేశ్.. వారసత్వ ప్రదేశాలు


భారత్, బంగ్లా రెండు దేశాల్లో సాగే ఈ యాత్రలో వారణాసిలోని గంగా హారతి, విక్రమశిల యూనివర్సిటీ, సుందర్బన్ డెల్టా, కజిరంగ నేషనల్ పార్క్ సహా పలు ప్రపంచ వారసత్వ ప్రాంతాలను కూడా సందర్శించవచ్చని వివరించారు. ఈ క్రూయిజ్ నుంచి ఎలాంటి మురికి నీరు బయటకు రాదని, శుద్ధీ చేసే యంత్రాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. గంగా నది కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

English summary
PM Narendra Modi Flags Off World's Longest River Cruise, Trip Costs 20 Lakhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X