'సంచలన ప్రతిపాదన: మోడీని తప్పించి పగ్గాలు అద్వానీకి!'
ప్రధాని స్థానం నుంచి మోడీని తప్పించి దేశాన్ని కాపాడాల్సిందిగా ఆమె బీజేపీని కోరారు.
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపి ఆ స్థానంలో బీజేపీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీ లేదా హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కూర్చోబెట్టవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రతిపాదన చేశారు.
మోడీ పనితీరును వ్యతిరేకిస్తూ మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని స్థానం నుంచి మోడీని తప్పించి దేశాన్ని కాపాడాల్సిందిగా ఆమె బీజేపీని కోరారు. ఇందుకోసం బీజేపీకి ఓ ప్రతిపాదన చేసిన మమతా.. మోడీ స్థానంలో అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్ లేదా అరుణ్ జైట్లీకి పగ్గాలు అప్పగించాలని సూచించారు.

ప్రస్తుతం దేశమంతటా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనంతటికీ మోడీయే కారణమని మమతా ఆరోపించారు. దేశంలో పరిస్థితులు చక్కబడాలంటే.. మోడీ స్థానంలో మరో బీజేపీ నాయకుడు ప్రధాని పదవిని చేపట్టాల్సిన అవసరముందని మమతా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే, పెద్ద నోట్ల రద్దును మమతా బెనర్జీ తొలినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కామ్ కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎంపీలను సబీఐ అరెస్టు చేయడంతో.. ఇదంతా మోడీ కక్ష సాధింపు చర్య అని మమతా ఆరోపిస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications