వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుత దృశ్యాలు: మహాకాల్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఉజ్జయినీలో శ్రీ మహాకాల్ లోక్‌ కారిడార్‌ తొలిదశను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకున్నారు ప్రధాని మోడీ.

ఈ సందర్భంగా మహాకాళుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాకాల్ లోక్ కారిడార్ తొలిదశను ప్రారంభించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పురాతన మహాకాళేశ్వర్‌ ఆలయ ఆవరణ అభివృద్ధి ప్రాజెక్టు తొలిదశ కింద రూ.856 కోట్లతో చేపట్టిన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఆలయంలో అభివృద్ధి చేసిన 900 మీటర్ల పొడవైన కారిడార్.. 'మహాకాల్ లోక్‌'ను.. భక్తులను ఆథ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లేవిధంగా తీర్చిదిద్దారు.

 PM Narendra Modi Inaugurates First Phase Of Mahakal Corridor Project In Ujjain

కాగా, 2017లో ఈ ప్రాజెక్టు మొదలైంది. గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా రాష్ట్రాల కార్మికులు నిర్మాణాలను తీర్చిదిద్దారు. మహాకవి కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం'లో పేర్కొన్న జాతుల మొక్కలను సైతం ఇక్కడి ఆవరణలో నాటారు. రుద్రాక్ష్, బేల్‌పత్ర, సప్తపర్ణి వంటి 40-45 రకాల మొక్కలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

శిప్రా నదీతీరాన వెలసిన ఉజ్జయినికి అవంతిక అనే పురాతన పేరుంది. దిగ్గజ పాలకుడు విక్రమాదిత్యుడు ఈ ప్రాంతాన్ని పాలించాడు. రెండు ద్వారాలు
మహాకాల్‌ లోక్‌ భక్తులకు స్వాగతం పలుతున్నట్టుగా రెండు ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి నందీ ద్వార్‌.. ఎత్తయిన రెండు నందులు.. భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఈ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రవేశ ద్వారానికి ముందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మరో ద్వారం పేరు పినాకి ద్వార్‌.. ఈ ద్వారంపైన ధనుస్సును అమర్చారు. త్రిపురాసురులు అనే రాక్షుసులను శివుడు హతమార్చినందుకు గుర్తుగా ఈ ద్వారానికి ఆ పేరు పెట్టారు. బ్రహ్మ రథసారధిగా ఉండగా.. పరమేశ్వరుడు ధనుస్సు చేతబట్టి.. త్రిపురాసురులను ఒకే బాణంతో అంతం చేస్తాడు. ఆ ఘట్టాన్ని వివరించేలా చెక్కిన శిల్పం.. అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. లోపల కూడా అత్యద్భుతమైన ఆధ్యాత్మిక లోకానికి వెళ్లినట్లు అనుభూతిని కలిగేలా నిర్మాణాలు భక్తులను ఎంతోగానే ఆకట్టుకుంటున్నాయి.

English summary
PM Narendra Modi Inaugurates First Phase Of Mahakal Corridor Project In Ujjain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X