ప్రతిచోట పాతపాట పాడుతున్న ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు ? నెంబర్ వన్ !
బెంగళూరు/చిత్రదుర్గ: ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. రెండు రోజుల క్రితం కర్ణాటకలో బీజేపీ అధికారంలో రావడానికి మీరు అందరూ సహకరిస్తే మీ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కర్ణాటకకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పారంటే ?.
శనివారం, ఆదివారం రెండు రోజులు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నిక ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లిపోయారు. మంగళవారం మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో అడుగుపెట్టారు. మంగళవారం కర్ణాటకలో కోటే నాడు అని ప్రసిద్ది చెందిన చిత్రదుర్గాలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు.

చిత్రదుర్గా పట్టణంలోని మురుగ రాజేంద్ర క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కన్నడ బాషలో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ పాత డైలాగ్ చెప్పారు. ప్రపంచంలోనే కర్ణాటకను నెంబర్ వన్ చేస్తామని, అది మీ చేతుల్లోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పాతపాట పాడారు.
ఈ అసెంబ్లీ ఎన్నికలు ఐదు సంవత్సరాల మీ భవిష్యత్తు కాదని, 25 ఏళ్ల మీ భవిష్యత్తును గుర్తు పెట్టుకుని ఓటు వెయ్యాలని, మీ బంగారు భవిష్యత్తుకు నేను హామీ ఇస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటకను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మేము బ్లూప్రింట్ కూడా తయారు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చిత్రదుర్గాలోని బహిరంగ సభలో చెప్పారు.
ఈసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ వస్తుందని, కన్నడిగులు బీజేపీని ఆదరిస్తారని మాకు సంపూర్ణ నమ్మకం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ నాయకుు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో చూసి నేను చాలా సంతోషంగా ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు.
మేము చేసే పనులు మాత్రమే చెప్పి తరువాత చేసి చూపిస్తామని, కాంగ్రెస్ పార్టీలాగా మేము ప్రజలకు ఉత్తుత్తి హామీలు ఇవ్వమని ప్రధాని మోదీ అన్నారు, గత మూడు నాలుగు రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ తాము కర్ణాటకను నెంబర్ వన్ చేస్తామని పదేపదే చెప్పడంతో బీజేపీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications