వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశానికే స్ఫూర్తి: మర్యం సిద్ధిఖీని అభినందించిన మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నిర్వహించిన భగవద్గీత ఛాపియన్‌ లీగ్‌ విజేత, ముంబైకి చెందిన మర్యం అసిఫ్‌ సిద్దిఖీని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఆమె దేశానికే స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని ప్రశంసించారు.

ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోడీని గురువారం తల్లిదండ్రులతో కలిసి సిద్దిఖీ కలిశారు. ఈ సందర్భంగా 12 ఏళ్ల చిన్నారిని.. మోడీ ప్రత్యేకంగా అభినందించారు. వివిధ మతాలకు చెందిన ఐదు పుస్తకాలను ఆమెకు బహూకరించారు.

PM Narendra Modi meets Bhagwad Gita contest winner Maryam

సర్వమతసారాన్ని గ్రహించిన సిద్ధిఖీ దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని అభినందించారు. ‘నా చిన్నారి స్నేహితురాలు మర్యంను కలిశాను. వివిధ మతాల గురించి తెలుసుకోవటంలో దేశానికే ఈమె ఆదర్శం.' అని మోడీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా ఆసిఫ్‌ సిద్దిఖీ.. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఆర్‌ఎఫ్‌), స్వచ్ఛ భారత్‌ అభియాన్‌కు వేర్వేరుగా రూ. 11 వేలు విరాళంగా ఇచ్చారు. మర్యం వెంట ఆమె తల్లిదండ్రులు అసిఫ్ నజీమ్ సిద్దిఖీ, పర్హాన్ అసిఫ్ సిద్దిఖీలు ఉన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Thursday met Maryam Asif Siddiqui, a 12-year-student from Maharashtra, who had won the Bhagwad Gita Champion League in March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X