వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ము కశ్మీర్‌లో స్థానిక ఎన్నికలు.. 98శాతం పోలింగ్, హర్షం వ్యక్తం చేసిన మోడీ

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా బ్లాక్ డెవలప్‌మెంట్ ఎన్నికలు నిర్వహించారని చెప్పారు. ఎన్నికల్లో 98శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని మోడీ తెలిపారు. మరోవైపు ఎలాంటీ హింసాత్మక సంఘటనలు జరగకుండా ఎన్నికలు జరగడంపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో పేర్కోన్నారు. అయితే ఇదంతా కూడ ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్లే సాధ్యమయిందని అన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అని అన్నారు.

370 రద్దుతో కశ్మీర్‌ ప్రజల్లో ఉత్సహాం

జమ్ము కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడం కోసం కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈనేపథ్యంలోనే ఆక్టోబర్ 31నుండి కేంద్రపాలిత ప్రాంతంగా మారనున్న నేపథ్యంలో ఆరునెలల లోపు పూర్తిస్థాయిని అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు ఎన్నికలు జరపాలని కేంద్రం భావిస్తోంది. ఈనేపథ్యంలోనే ముందస్తుగా జమ్ము కశ్మీర్‌ను అభివృద్ది దిశలో నడిపేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందుకోసం స్థానిక సంస్థలను టార్గెట్‌గా పెట్టుకుంది. స్థానిక సంస్థల ద్వార ఫండింగ్ ఉండడంతో వాటికి ఎన్నికలు నిర్వహించింది.

ప్రశాంతంగా బ్లాక్‌స్థాయి ఎన్నికలు

ఇందులోభాగంగానే గురువారం నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 310 బ్లాకుల్లో ఎన్నికలు జరగాయి. బీడీసీ ఎన్నికల్లో 1090 మంది బీడీసీల చైర్‌పర్సన్స్ కోసం పోటిచేశారు. కాగా గతంలో ఎప్పుడు లేనట్టుగా 98 శాతం ఓటర్లు ఎన్నికల్లో పాల్గోన్నారు. 27 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే గత 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ ప్రజలు చాలా ఉత్సహాంగా ఉన్నారని ,దీంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ప్రధాని మోడీ పేర్కోన్నారు. ఇందుకోసం సహకరించిన ప్రతి పార్లమెంటేరియన్‌కు తాను మరోసారి కృతజ్ఝత తెలుపుతున్నానని అన్నారు.

 ఎన్నికలకు దూరంగా పార్టీలు

ఎన్నికలకు దూరంగా పార్టీలు

అయితే ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా పీడీపీతోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ మరియు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర కమ్యునిస్టు పార్టీలు సైతం ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. నాయకులను దూరంగా ఉంచి ఎన్నికలు నిర్వహించడంపై ఆయా పార్టీల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో నిలిచి గెలిచారు.మొత్తం 310 బీడీసీల్లో 27 మంది ఏకగ్రీవంగా గెలవగా వారిలో 22 మంది బీజేపీ చెందిన వారు ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తారు. గ్రామ, బ్లాక్, మరియు జిల్లా లేవల్లో ఎన్నికలు ఉంటాయి. అయితే గ్రామ లెవల్ గతంలో నిర్వహించగా బ్లాక్ లెవల్ ఎన్నికలు గురువారం నిర్వహించారు. మరోవైపు తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సోపియాన్, పుల్వామా జిల్లాల్లో వరుసగా 85.3. 86.2 శాతం ఓటర్లు పాల్గోన్నారు.

English summary
PM Narendra Modi on Friday praised the 98 per cent turnout in Jammu and Kashmir Block Development Council (BDC) elections held on October 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X