వడదొరాకు మోడీ రిజైన్, వారణాసికి ప్రాతినిధ్యం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారంనాడు వడదొర లోకసభ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన వడదొరా నుంచే కాకుండా వారణాసి నుంచి కూడా లోకసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. వారణాసి నుంచి లోకసభ ప్రాతినిధ్య వహించాలని నిర్ణయించుకున్న మోడీ వడదొరా స్థానానికి రాజీనామా చేశారు.

ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పించారు. మోడీ రాజీనామాతో వడదొరాకు తాజాగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. రెండు స్థానాల నుంచి కూడా మోడీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. స్థానికేరుడంటూ మోడీని కొంత మంది వ్యతిరేకించారు.

PM Narendra Modi retains Varanasi, vacates Vadodara seat

కొందరు నాయకులు స్థానికత అంశాన్ని ముందుకు తెచ్చినప్పటికీ మోడీ వడదోరా నుంచి విజయం సాధించారు. వారణాసిలో మోడీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను, కాంగ్రెసు అభ్యర్థి అజయ్ రాయ్‌ను 3 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు.

వడదొరాలో నరేంద్ర మోడీ కాంగ్రెసు అభ్యర్థి మధుసూదన్ మిస్త్రిని ఐదు లక్షలకుపైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఇంతకు ముందు వారణాసి నుంచి లోకసభకు బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ ప్రాతినిధ్యం వహించారు. ఆయన కాన్పూర్ నుంచి పోటీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+