నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు!

ఆయన పక్కా రాజకీయ వ్యూహకర్త.. కోట్లాది మందిని తన ప్రసంగాలతో కట్టిపడేసే వాగ్ధాటి గల నేత.. ప్రపంచ వేదికలపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న ధీశాలి. ఆయనే భారత ప్రధాని నరేంద్ర మోదీ. సుదీర్ఘకాలం పాటు (8,931 రోజులు) అధికార బాధ్యతల్లో ఉండి అరుదైన రికార్డు సృష్టించిన మోదీ, తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎదురైన కొన్ని ఆత్మీయ అనుభవాలను, తనలోని సామాన్యుడి కోరికలను పంచుకున్నారు.

ప్రపంచ దేశాల అధినేతలతో భేటీలు, నిరంతర సమీక్షలతో బిజీగా ఉండే మోదీకి ఒక చిన్న కోరిక ఉందట. సాయంత్రం ఆరు గంటల సమయంలో, నీలాకాశం కింద ఏకాంతంగా కూర్చుని ప్రశాంతంగా ఒక కప్పు 'చాయ్' తాగాలనేది ఆయన చిరకాల వాంఛ. కానీ, దశాబ్దాలుగా సాయంత్రం పూట ఏదో ఒక అధికారిక సమావేశంలో ఉండటం వల్ల ఆ చిన్న కోరిక తీరడం లేదని ఆయన గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఐదు రోజుల పాటు ఆహారం వెంట పెట్టుకుని అడవుల్లోకి వెళ్లిపోయి, ప్రకృతి ఒడిలో 'నన్ను నేను తెలుసుకోవడం' కోసం గడిపేవారట. అది తనను తాను రీఛార్జ్ చేసుకునే మార్గమని ఆయన చెబుతారు.

PM Narendra Modi Reveals His Simple Wish A Quiet Cup of Chai Under the Open Sky After 8 931 Days in Power

ఆ పిలుపు కోసం ఎదురుచూశా..

ముఖ్యమంత్రి అయ్యాక తన చిన్ననాటి స్నేహితులు 35 మందిని పిలిచి విందు ఇచ్చిన సందర్భాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు. తాను ఏ హోదాలో ఉన్నా పాత స్నేహితుడినే అని వారికి అనిపించాలని ఆశపడ్డారు. కానీ, వచ్చిన వారంతా ఆయన్ని 'ముఖ్యమంత్రి' అని గౌరవంగా పిలిచారే తప్ప, ఒక్కరు కూడా పాత చనువుతో 'నువ్వు' అని పిలవలేదు. ఆ గౌరవప్రదమైన దూరం తనను కొంత బాధించిందని ఆయన ఆవేదన చెందారు.

అమ్మే సర్వస్వం.. ఫోటోగ్రఫీ ప్రాణం!

మోదీకి ప్రకృతి అన్నా, వన్యప్రాణులన్నా అమితమైన ఇష్టం. ముఖ్యంగా ఫోటోగ్రఫీ పట్ల ఆయనకు మంచి ఆసక్తి ఉంది. కెమెరా లెన్సులు, లైటింగ్, ఫ్రేమింగ్ వంటి సాంకేతిక విషయాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఇక తన తల్లి హీరాబెన్ గురించి చెబుతూ.. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో జెండా ఎగురవేసి క్షేమంగా ఉన్నానని చెప్పడానికి మొదట ఫోన్ చేసింది అమ్మకేనని గుర్తుచేసుకున్నారు. సన్యాసం తీసుకోవాలని ఒకప్పుడు భావించినా, వివేకానందుడి స్ఫూర్తితో ప్రజాసేవ వైపు అడుగులు వేశానని చెప్పారు.

క్రమశిక్షణే ఆరోగ్య రహస్యం..

మోదీ ఆరోగ్య రహస్యం ఆయన పాటించే కఠినమైన ఆహార నియమాలు. 50 ఏళ్లుగా నవరాత్రుల్లో కేవలం వేడి నీళ్లే తాగుతారు. మంచం ఎక్కిన 30 సెకన్లలోనే గాఢ నిద్రలోకి జారుకోవడం ఆయన ప్రత్యేకత. యోగా, ధ్యానంతో పాటు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్లే నిత్యం చురుగ్గా ఉండగలుగుతున్నానని ఆయన వివరించారు. ప్రత్యర్థి అయినా మమతా బెనర్జీని 'దీదీ'గా భావించి, ఆమె పంపే కుర్తాలు, మిఠాయిలను స్వీకరించడం ఆయనలోని మానవీయ కోణానికి నిదర్శనం.

సమాజానికి సందేశమిచ్చే సినిమాలన్నా, కవిత్వం రాయడమన్నా మక్కువ చూపే మోదీ.. ఒక సాధారణ కార్యకర్త నుంచి విశ్వనాయకుడిగా ఎదిగినా, తనలోని సామాన్యుడిని ఇంకా సజీవంగానే ఉంచుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+