ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో చివరికి ఫ్యాషన్ షో అయ్యింది, ఫలితం ఉండదు !
బెంగళూరు/మైసూరు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రధాని ఇన్ని రోజులు ఎన్నికల ప్రచారానికే సమయం కేటాయించడం తాను ఎప్పుడు చూడలేదని, ప్రజల సమస్యలు గాలికి వదిలేసిన ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో రోడ్ షో నిర్వహించారని, ఆయన రోడ్ షో చివరికి ఫ్యాషన్ షో అయ్యిందని కర్ణాటక ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ మండిపడ్డారు.
మంత్రి పదవి రాలేదని కోపంతో బీజేపీకి దూరం అయిన మైసూరుకు చెందిన హెచ్. విశ్వనాథ్ అప్పటి నుంచి బీజేపీ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. సోమవారం మైసూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ బీజేపీ నాయకుల మీద మండిపడ్డారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు చాలా గౌరవం ఉందని, ఆయన ఉన్న పదవి అలాంటిది అని విశ్వనాథ్ అన్నారు.

దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ విశ్వనాథ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో బెంగళూరులో మంచి ఫ్యాషన్ షో అయ్యిందని ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ వ్యంగంగా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలకు ప్రజల నుంచి అనుకున్న మద్దతు రాలేదని విశ్వనాథ్ ఆరోపించారు.
బీజేపీ నాయకుల బహిరంగ సభలకు ప్రజల నుంచి మద్దతు రాకపోవడం వలనే ప్రధాని మోదీతో రోడ్ షోలు నిర్వహించారని ఎమ్మెల్సీ విశ్వనాథ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలకు భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేశారని, ఇంత చేసినా బీజేపీకి మాత్రం ఎన్నికల తరువాత నిరాశ తప్పదని, ఆ పార్టీని ప్రజలు ఆదరించరని విశ్వనాథ్ అన్నారు.

సిద్దరామయ్య, డీకే శివకుమార్ లను ఓడించాలని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, ఇద్దరు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఎమ్మెల్సీ విశ్వనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ విశ్వనాథ్ జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications