Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరు రోడ్ షోలో హైటెట్, మోదీ కారు అక్కడే ఎందుకు ఆగింది !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో పూర్తి అయిన గంట తరువాత రోడ్ షో జరిగిన పలు ప్రాంతాల్లో వర్షం మొదలైయ్యింది. దేవుడు కూడా మోదీ రోడ్ షోకు సహకరించి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూశారని బీజేపీ నాయకులు అంటున్నారు.

బెంగళూరు 26 కిలోమీటర్లు జరిగిన రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడా ప్రజలు ఉద్దేశించి మాట్లాడలేదు. కోణెణకుంటలో ఎత్తిన చేతులు 2 గంటల 40 నిమిషాలు పాటు అటూఇటూ తిప్పుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల్లో, బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఒక్క చోట తప్పా ఎక్కడ కూడా మోదీ రోడ్ షో నిర్వహించే వాహనాలు నిలపలేదు.

pm Narendra Modi

అది ఎక్కడంటే ?, రోడ్ షో జరుగుతున్న మార్గంమధ్యలో రోడ్డు పక్కన పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. అదే మార్గంలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తుండటంతో ఆంజనేయస్వామి విగ్రహం అలకంరించారు. రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ వెలుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారిగా ఆంజనేయస్వామి విగ్రహం చూసి వాహనం నిలపమని సెక్యూరిటీకి చెప్పారు.

pm Narendra Modi

ఓపెన్ టాప్ వాహనం మీద నుంచి తలవంచి ఆంజనేయస్వామి విగ్రహానికి నమస్కారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ జై భజరంగబలి అని నినాదం చేశారు. ఆ సమయంలో స్థానికులు కూడా జైభజరంగబి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంజనేయస్వామికి ప్రధాని నరేంద్ర మోదీ తలవంచి నమస్కారం చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ప్రకటించడం కలకలం రేపింది. ఏరోజు అయితే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో ఆ రోజే కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసిన మోదీ జైభజరంగబలి అంటూ నినాదాలు చేసి ఎన్నికల ప్రసంగం మొదలుపెట్టారు.

pm Narendra Modi

ఆరోజు నుంచి బెంగళూరులో జరిగిన రోడ్ షో లో వరకు జైభరజరంగబలి అని ప్రధాని నరేంద్ర మోదీ నినాదాలు చేసి బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపి కాంగ్రెస్ పార్టీకి దడపుట్టించారు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆదే పార్టీలోని కొందరు హిందువులు వ్యతిరేకించడంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది.

కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో జరిగిన రోడ్ షోలో ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర నిమిషం పాటు వాహనం నిలపడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరులో జరిగిన రోడ్ షోలో పారిశుద్ద కార్మికులు కూడా ప్రధాని నరేంద్ర మోదీ మీద పూలవర్షం కురిపించారు.

అదే సమయంలో వాహనం నిలిపిన ప్రధాని మోదీ ఆ కారు మీద ఉన్న పూలు రెండు చేతుల్లో ఎత్తుకుని పారిశుద్ద కార్మికుల మీద చల్లడంతో వారు సంతోషంతో పులకించిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో సందర్బంగా పలు ప్రాంతాల్లో రహదారుల్లో వాహనం సంచారం నిషేధించంతో ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+