ఎంపీ కవితకు ప్రధాని మోడీ లేఖ: ఏముందో తెలుసా?

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు(మార్చి 13) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తెలుగులోనే ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం విశేషం.

'శ్రీమతి కల్వకుంట్ల కవిత, మీ జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి. దేశ ప్రజలకు మీరు సేవలందించేందుకు వీలుగా కావలసిన ఆరోగ్యకర, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నాను. శుభాభినందనలతో నరేంద్ర మోడీ' అని రాసిన లేఖను ప్రధానమంత్రి కార్యాలయం.. ఎంపీ కవితకు పంపింది.

ఈ లేఖపై ప్రధాని మోడీ సంతకం కూడా చేశారు. ఇందుకు ఎంపీ కవిత ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ప్రధాని మోడీ గతంలోనూ కొందరు ప్రపంచ నేతలకు వారి వారి మాతృభాషలో శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా తన తనయ, ఎంపీ కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను" అని కేసిఆర్ తాను రాసిన లేఖలో అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi conveyed birthday greetings to Telangana Rashtra Samithi (TRS) MP Kalvakuntla Kavitha in Telugu on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి