వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ అమితాబ్ బచ్చన్ కంటే మహానటుడు, అంతే తేడా: ఎవరన్నారంటే ?

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గుజరాత్ లో డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు విడతలుగా శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ అమితాబ్ బచ్చన్ కంటే మహానటుడు అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగింది.

ప్రధాని మోడీ ఇచ్చిన హామీ నేరవేర్చాలంటే 45 ఏళ్లు కావాలి: రాహుల్ గాంధీ సెటైర్ !ప్రధాని మోడీ ఇచ్చిన హామీ నేరవేర్చాలంటే 45 ఏళ్లు కావాలి: రాహుల్ గాంధీ సెటైర్ !

శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో పోటాపోటీగా ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. 22 ఏళ్ల బీజేపీ పాలనలో గుజరాత్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు.

రిజర్వేషన్లు అడగరాదు !

రిజర్వేషన్లు అడగరాదు !

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో తమ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం అనేక మంది పోరాటం చేశారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. అయితే గుజరాత్ లో మాత్రం తమ హక్కుల కోసం పాటీదార్లు పోరాటం చేస్తే ఇక్కడి ప్రభుత్వం సహించలేకపోయిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

 పోలీసు తుపాకి బుల్లెట్లకు బలి !

పోలీసు తుపాకి బుల్లెట్లకు బలి !

గుజరాత్ లో పాటీదార్లు రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తే ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సహించలేకపోయిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు పాటీదార్ల మీద పోలీసులు రెచ్చిపోయి కాల్పులు జరిపారని, 14 మంది అమాయకులు తుపాకి బుల్లెట్లకు బలి అయ్యారని రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు.

బీజేపీని వ్యతిరేకిస్తే లాఠీ రుచి

బీజేపీని వ్యతిరేకిస్తే లాఠీ రుచి

గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీని వ్యతిరేకిస్తే కచ్చితంగా పోలీసుల లాఠీ రుచి చూడాల్సిందే అంటూ రాహుల్ గాంధీ స్థానిక ప్రజలను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాటీదార్లకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

 ప్రధాని మోడీ మహానటుడు

ప్రధాని మోడీ మహానటుడు

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దేశంలో అత్యుత్తమ నటుడు అని అందరికీ తెలుసని, అయితే ఆయన కంటే ప్రధాని నరేంద్ర మోడీ మహానటుడని రాహుల్ గాంధీ సెటైర్ వేశారు.

నటుడికి మోడీకి అదే తేడా

నటుడికి మోడీకి అదే తేడా

సినిమాల్లో నటించే వారి కళ్లలో నీళ్లు రావాలంటే గ్లిజరిన్, లేదా లెన్స్ ఉపయోగిస్తారని, అయితే ఆ రెండు ఉప యోగించకుండానే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల ముందు నిలబడి కళ్లలో నీళ్లు రప్పిస్తారని రాహుల్ గాంధీ ఎద్దేవ చేశారు. నటుడికి, ప్రధాని మోడీకి ఉన్న తేడా అదే అని, ఆయన మహానటుడు అంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

English summary
Congress party vice president Rahul Gandhi launched a sharp personal attack on Prime Minister Narendra Modi on Wednesday, saying he was a "far better actor than Amitabh Bachchan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X