వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షమించండి..: సభా ముఖంగా విద్యార్థులకు మోడీ, ఎందుకలా అన్నారు?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pariksha Pe Charcha : Modi Apologised to Students

న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దాలని ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. బహుశా.. దీన్ని దృష్టిలో ఉంచుకునే మోడీ 'క్షమాపణలు' చెప్పారేమో!.. శుక్రవారం న్యూఢిల్లీలోని తల్కోతోరా స్టేడియంలో జరిగిన 'పరీక్షా పే చర్చా' కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

మోడీ క్షమాపణలు:

మోడీ క్షమాపణలు:

చర్చ సందర్భంగా మోడీ ఎక్కువగా హిందీలోనే మాట్లాడారు. దీంతో హిందీ రాని విద్యార్థులకు ఆయన చెప్పిన విషయాలు అంతగా అర్థం కాలేదు.

ఈ విషయాన్ని గుర్తించిన మోడీ.. 'భాష వల్ల కొంతమంది విద్యార్థులకు నేను చెప్పిన విషయాలు చేరలేకపోయి ఉంటాయి.. అందుకు క్షమాపణలు' అని చెప్పారు.

తమిళం అందమైనది.. కానీ మాట్లాడలేను..

తమిళం అందమైనది.. కానీ మాట్లాడలేను..

'నాకు తమిళంలో మాట్లాడటం రాదు. తమిళం చాలా పాత భాష. సంస్కృతం కంటే పురాతమనైన భాష కానీ చాలా అందమైనది. నేను వణక్కం అని మాత్రమే చెప్పగలను. తమిళంలో మాట్లాడలేను' అని మోడీ పేర్కొన్నారు.

పరీక్షా పే చర్చా.. 'లైవ్'

పరీక్షా పే చర్చా.. 'లైవ్'

వేరే రాష్ట్రాల భాషల్లో మాట్లాడలేకపోయినందుకు తనను విద్యార్థులను మోడీ క్షమాపణలు కోరారు. అయితే తాను మాట్లాడిన విషయాలన్ని అన్ని భాషల్లోని విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కాగా, 'పరీక్షా పే' చర్చ కార్యక్రమాన్ని దేశం మొత్తం అన్ని పాఠశాల్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం.

ఇతరులతో పోటీ వద్దు..

ఇతరులతో పోటీ వద్దు..

ఇతరులతో పోటీ వద్దని, తమతో తామే పోటీ పడాలని ఈ సందర్బంగా మోడీ విద్యార్థులకు సూచించారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చని అన్నారు.

అలాగే పరీక్షల సమయంలో ఎదుర్కొనే ఒత్తిడిని, తల్లిదండ్రుల అంచనాలను అందుకునే క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని ఎలా అధిగమించాలో మోడీ పలు సూచనల ద్వారా వివరించారు.

English summary
Prime Minister Narendra Modi on Friday said, “Tamil is the oldest and a beautiful language
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X