కొద్దిసేపు మాట్లాడుకున్న రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. వీడియో వైరల్
ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. పార్లమెంటరీ కాంప్లెక్స్ లో ఈ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పార్లమెంట్ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలేకు నివాళులు అర్పించిన అనతరం అక్కడే ఉన్న రాహుల్ గాంధీతో ప్రధాని మోదీ ఆప్యాయంగా మాట్లాడటం ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు వాడీ వేడీగా ప్రసంగాలు చేస్తున్న సమయంలో ఈ ఆసక్తికర వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సామాజికవేత్త, సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ప్రముఖ నాయకులు నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తదితరులు నివాళులు అర్పించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న రాహుల్ గాంధీతో ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో వీరి వెంట లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు నడ్డా, అర్జున్ రామ్ మేఘ్ వాల్ తదితరులు ఉన్నారు.

అయితే సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. సోనియా గాంధీ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ.. రాహుల్ గాంధీని అడిగినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ ఇటీవల ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా బెస్ట్ విషెస్ తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
#Watch | Namastes, Rare Candid Chat As PM Modi, Rahul Gandhi Meet At Delhi Event pic.twitter.com/inLZSPXNh7
— NDTV (@ndtv) April 11, 2026
ఇక సోనియా గాంధీ మార్చి 31న సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. సిస్టెమిక్ ఇన్ఫెక్షన్, ఫీవర్ కారణాలతో ఆమె మార్చి 24 న ఆస్పత్రిలో చేరారు. మరోవైపు పూలే జయంతి సందర్భంగా ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. పూలే ను గైడింగ్ లైట్ అని అభివర్ణించారు. విద్య, సంక్షేమం పై పూలే సంస్కరణలు ఇప్పటి జనరేషన్స్ కూ ఉపయోగపడుతున్నాయని కొనియాడారు. అంతకుముందు పూలేకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications