మోడీ సభలో కాంగ్రెస్ సీఎం ప్రసంగం తీసేశారా ? పీఎంవో క్లారిటీ..!
ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాజస్తాన్ లో ప్రధాని మోడీ త్వరలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా స్ధానికంగా ఏర్పాటు చేసిన ఓ బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. అసలే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ సభకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన ప్రసంగాన్ని ప్రధాని మోడీ సభ ప్రోటోకాల్ లిస్ట్ లో నుంచి తీసేసినట్లు తెలుస్తోంది. దీనిపై అశోక్ గెహ్లాట్ ఫైర్ అయ్యారు. సీఎం అయిన తన ప్రసంగాన్నే తీసేస్తారా అంటూ ట్వీట్ చేశారు.
రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమం నుండి తన మూడు నిమిషాల ప్రసంగాన్ని తొలగించినట్లు గెహ్లాట్ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి వచ్చిన ఆయన్ను ట్వీట్ ద్వారా స్వాగతిస్తానని చెప్పారు. దీనిపై ప్రధాని మోడీ కార్యాలయం స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ప్రసంగాన్ని కార్యక్రమం నుండి తొలగించారని ట్వీట్ చేయడంపై పీఎంవో వివరణ ఇచ్చింది. గెహ్లాట్ వాదనలను పీఎంలో తోసిపుచ్చింది. ఓవైపు గెహ్లాట్ ప్రసంగం తీసేసిన మాట నిజమేనని అంగీకరిస్తూనే మరోవైపు ఇందుకు దారి తీసిన కారణాల్ని రీట్వీట్ చేసింది.

श्री @ashokgehlot51 जी,
— PMO India (@PMOIndia) July 27, 2023
प्रोटोकॉल के अनुसार आपको विधिवत आमंत्रित किया गया था और आपका भाषण भी रखा गया था। लेकिन आपके ऑफिस ने बताया कि आप शामिल नहीं हो पाएंगे।
प्रधानमंत्री @narendramodi की पिछली यात्राओं के दौरान भी आपको हमेशा आमंत्रित किया गया है और आपकी गरिमामयी उपस्थिति भी… pic.twitter.com/6MxBLmwcWq
రాజస్తాన్ లో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాని మోడీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయన ఏడుసార్లు రాష్ట్రంలో పర్యటించారు. ఈసారి రాజస్తాన్ లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ప్రధాని మోడీ టూర్లు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. దీని చుట్టూ రాజకీయాలు కూడా అంతే స్ధాయిలో సాగుతున్నాయి.
-
జాక్ పాట్ కొట్టిన భారత్.. భారీగా బయటపడ్డ చమురు నిక్షేపాలు.. 19 బావుల్లో.. -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
రాష్ట్రానికి 7వ వేతన సంఘం వర్తింపు -
మహిళా రిజర్వేషన్లపై మోదీ కీలక ప్రకటన.. నారీశక్తికి పట్టాభిషేకం -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్












Click it and Unblock the Notifications